చీరా చొక్కా చిక్కడిపోవాలో..
అగ్ర హీరో రామ్‌చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేస్తున్నది. ముఖ్యంగా చికిరీ చికిరీ, రైరైరారా సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనాలుగా మారాయి.
అగ్ర హీరో రామ్‌చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేస్తున్నది. ముఖ్యంగా చికిరీ చికిరీ, రైరైరారా సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని మూడో పాటను మేకర్స్ నేడు(శనివారం) విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ పాట ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు. ‘హెల్లో హెల్లో హెల్లో హెల్లెల్లో.. బావా.. చీరా చొక్కా చిక్కడిపోవాలో..’ అంటూ సాగే ఈ పాటను దర్శకుడు బుచ్చిబాబు సానా అత్యంత ఎనర్జిటిక్‌గా, కలర్ఫుల్గా చిత్రీకరించినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తున్నది.
పవర్ఫుల్ డ్రమ్ బీట్స్, క్యాచీ రిథమ్‌తో జాతర వాతావరణాన్ని తలపించేలా ఈ ప్రోమో సాగింది. రామ్‌చరణ్, శ్రుతిహాసన్, జాన్వీ కపూర్‌లపై ఈ పాటను చిత్రీకరించారు. ైస్టెలిష్ స్టెప్పులతో, అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్‌తో ముగ్గురూ ఆకట్టుకున్నారు. శనివారం భోపాల్‌లో జరిగే భారీ మ్యూజికల్ ఈవెంట్లో పూర్తి పాటను విడుదల చేస్తారు. శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో జగపతిబాబు, దివేందుశర్మ, బోమన్ ఇరానీ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేల్, సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాత: వెంకటసతీశ్ కిలారు, నిర్మాణం: వృద్ధి సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

