sankranti Celebrations | ‘సంక్రాంతి’.. ఈ పేరు చెబితే చాలు.. పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు సొంత ఊళ్లకు వెళ్తామా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక సంక్రాంతికి సాధారణ ప్రజలే కాకుండా టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా వాళ్ళ సొంత ఊళ్లకు పయనమవుతుంటారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లో జరుపుకోనుంది టాలీవుడ్ మెగా ఫ్యామిలీ.
సంక్రాంతి వేడుకలకు ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకు పయనంకాగా.. తాజాగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లీంకారా(Klin Kaara)తో బెంగళూరుకి బయలుదేరారు. క్లీన్ కారా (Klin Kaara) పుట్టిన తర్వాత వస్తున్న మొదటి సంక్రాంతి కావడంతో ఈ పండుగను భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకోనుంది. ఇక వీరితో పాటుగా పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్, ఆద్యలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.