అభిమానుల అంకితభావానికి ధన్యవాదాలు: చరణ్

కరోనా సెకండ్ వేవ్ సమయంలో మెగా ఫ్యామిలీతో పాటు వారి అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి గత ఏడాది కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఈ ఏడాది ఆక్సిజన్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ లేక ఎవరు చనిపోకూడదనే గొప్ప సంకల్పంతో.. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలో ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’ని స్థాపించేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే పలు జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు కాగా, ఇవి పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ ఫుల్గా ముందుకు తీసుకెళుతున్న అభిమానులకు తన ట్విట్టర్ ద్వారా శుభాభినందనలు తెలిపారు చరణ్. ‘‘అభిమానులు ఈ కోవిడ్ 19 మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సహాయం చేయడం నుండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు ఎంతో అంకితభావంతో పని చేశారు. ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి ఎందరికో సహాయం చేసిన మీ అందరికీ పేరుపేరున నా శుభాభినందనలు. మీ అందరి అంకితభావానికి నా ధన్యవాదాలు..’’ అని చరణ్ ఈ లేఖలో తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్లో స్వల్ప భూకంపం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- fans
- oxygen banks
- ram charan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

