ఇటీవలే భూమా మౌనికా రెడ్డితో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ (Manchu Manoj). ఈ సందర్భంగా మనోజ్-మౌనిక దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా మంచు మనోజ్ ఓ ప్రముఖ వ్యక్తి నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకుని థ్రిల్ అయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనే కదా మీ డౌటు. స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan). ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నాడు మంచు మనోజ్.
సర్ప్రైజ్ కానుకను మంచు మనోజ్ షేర్ చేసుకుంటూ.. మాల్దీవుల ట్రిప్ తర్వాత మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూడలేకపోతున్నా. వెకేషన్లో అద్భుతమైన సమయాన్ని ఆస్వాదించండి. స్వీట్ కపుల్ రాంచరణ్, ఉపాసన.. మిస్టర్ అండ్ మిసెస్ మిత్రమా.. మీ ప్రేమకు ధన్యవాదాలు.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. క్రిస్టల్ డాల్స్తోపాటు పూల బొకేతో ఉన్న గిఫ్ట్ ప్యాక్‌ను మనోజ్ దంపతులకు పంపించాడు రాంచరణ్. ఇంతకీ ఆ ప్యాక్‌లో ఏం గిఫ్ట్ ఉందోనంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
మంచు మనోజ్ ప్రస్తుతం వరుణ్ దర్శకత్వం వహిస్తున్న What The Fish చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా రాంచరణ్-ఉపాసన దంపతులు ప్రస్తుతం మాల్దీవులు వెకేషన్లో ఉన్నారు. వెకేషన్ పూర్తి చేసుకుని తిరిగి రాగానే రాంచరణ్-ఉపాసన దంపతులను కలుబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు మంచు మనోజ్.
రాంచరణ్, మంచు మనోజ్ మంచి స్నేహితులని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మంచు మనోజ్ మరోవైపు అహం బ్రహ్మాస్మిలో కూడా నటిస్తుండగా.. ఈ సినిమా లాంఛింగ్ వేడుకకు రాంచరణ్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
MalaikottaiVaaliban | ప్రీ లుక్‌తో మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్డేట్
Karthik Ghattamaneni | పుకార్లకు చెక్ పెట్టిన రవితేజ డైరెక్టర్..
Mrunal Thakur | చాలా ఎక్జయిటింగ్‌గా ఉందంటోన్న మృణాళ్ ఠాకూర్