UNSTOPPABLE-2 | పవన్ కళ్యాణ్ సీక్రెట్స్‌ను బయటపెట్టిన రామ్‌చరణ్..!
ఎప్పుడెప్పుడా అని పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ పవన్ ఎపిసోడ్ గత రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. వీరిద్దరి మధ్య సంభాషణలు ఎలా ఉంటాయి అనే ఉత్కంఠకు తెరపడింది.
Unstoppable-2 | ఎప్పుడెప్పుడా అని పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ పవన్ ఎపిసోడ్ గత రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. వీరిద్దరి మధ్య సంభాషణలు ఎలా ఉంటాయి అనే ఉత్కంఠకు తెరపడింది. బాలయ్య ఎప్పటిలాగే చలాకీ ప్రశ్నలు వేస్తూ పవన్‌తో సమాధానాలు రాబట్టాడు. ఇక ప్రభాస్ ఎపిసోడ్లో లాగానే చరణ్‌కు ఫోన్ చేసి పవన్‌కు నీకు మధ్య జరిగిన ఆసక్తకరమైన సంఘటన గురించి బాలయ్య అడిగితెలుసుకున్నాడు.
ఫోన్ కాల్లో పరస్పర పలకరింపుల తర్వాత వీరి మధ్య సంఘటన గురించి అడగ్గా తండ్రి చిరంజీవి హీరోగా, బాబాయి నాగబాబు నిర్మాతగా బిజీగా ఉన్న సమయంలో పవన్ బాబాయ్‌కు పిల్లలను చూసుకునే డ్యూటీ ఉండేదని చెప్పాడు. చరణ్ ఐదేళ్ల వయసులో ఓ సారి సింగపూర్ వెళ్లినప్పుడు అక్కడ పిజ్జాలు, బర్గర్లంటూ ఏది పడితే అది తినేసి రోడ్డుపై వామ్టింగ్ చేసుకున్నాడట. అయితే అప్పుడు పవన్.. అందరూ చూస్తున్నారని పట్టించుకోకుండా ఓపిగ్గా మొత్తం శుభ్రం చేసి హోటల్‌కు తీసుకుపోయాడని చరణ్ తెలిపాడు.
దీంతో పాటుగా పవన్ సీక్రెట్స్ గురించి చెప్పమని బాలయ్య అడగ్గా ఆయన లైఫ్ బోరింగ్. సీక్రెట్స్ ఏం ఉండవు. బాబాయ్‌కి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. వారంలో ఏడు రోజులు తినమన్నా తింటారు అంటూ పవన్ గురించి చెప్పుకొచ్చాడు. గురువారం రాత్రి 9గంటలకు విడుదలైన ఈ ఎపిసోడ్ 14 గంటల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను సాధించి సరికొత్త రికార్డు సృష్టిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

