RC16 | శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో రాంచరణ్ 16వ (RC16) సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసిందే. ఆర్సీ 16 రెగ్యులర్ షూటింగ్ మార్చి రెండోవారం నుంచి షురూ కానుందని ఇప్పటికే వార్త హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
మేకర్స్ మార్చి 27న రాంచరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంఛ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు పాపులర్ యాక్టర్లు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే మరికొన్ని రోజుల్లోనే అభిమానులకు అదిరిపోయే కానుక అందబోతుందన్నమాట. ఆర్సీ 16లో రాంచరణ్ ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడనుండగా.. కాగా దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది.
ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించబోతున్నాడు. రాంచరణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్‌గా నిలిచిన రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గేమ్ ఛేంజర్ సెట్స్‌పై ఉండగానే ఆర్సీ 16 అప్డేట్ రావడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మెగా అభిమానులు.
ఆఫీస్ ప్రారంభోత్సవ ఫొటోలు..
The team of #RC16 from the office opening Pooja ❤️
Full fledged Pre-production underway💥
Mega PowerStar @AlwaysRamCharan @BuchiBabuSana @aryasukku @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/8pjGiCARC2
— Vriddhi Cinemas (@vriddhicinemas) August 27, 2023