Ram Charan | నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ స్పందన ఏంటి.. రిపబ్లిక్ సమిట్‌లో చేసిన కామెంట్స్ వైరల్
Ram Charan | సినిమా, రాజకీయాలు రెండు వేర్వేరు రంగాలు అయినప్పటికీ.. ఆయా రంగాల్లో రాణిస్తున్న ప్రముఖుల మధ్య పోలికలు వస్తే అవి ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ మధ్య చేసిన పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Ram Charan | సినిమా, రాజకీయాలు రెండు వేర్వేరు రంగాలు అయినప్పటికీ.. ఆయా రంగాల్లో రాణిస్తున్న ప్రముఖుల మధ్య పోలికలు వస్తే అవి ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ మధ్య చేసిన పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్గా నిర్వహించిన ‘రిపబ్లిక్ సమిట్ 2026’ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్‌కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమలోకి వచ్చినప్పటికీ, సొంత కష్టంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చరణ్‌ను.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్‌తో పోలుస్తూ రిపోర్టర్ ప్రశ్నించారు.
నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనా, నారా లోకేష్ తన సొంత కృషితో ప్రజా నాయకుడిగా ఎదుగుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా వచ్చిన మీరు కూడా స్వయంకృషితో స్టార్‌డమ్‌ను సాధించారు. మీ ఇద్దరి ప్రయాణాల్లో పోలిక ఉందని భావిస్తున్నారా?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రామ్ చరణ్ ఎలాంటి సంకోచం లేకుండా స్పందించారు. “కచ్చితంగా ఉంది” అంటూ నారా లోకేష్‌తో తన ప్రయాణానికి ఉన్న పోలికను అంగీకరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
వాస్తవానికి ఇద్దరూ తమ తమ రంగాల్లో ప్రముఖ కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఒకవైపు రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడిగా నారా లోకేష్ ప్రజా జీవితంలో అడుగుపెట్టగా, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ సినీ రంగంలో ప్రవేశించారు. అయితే ఇద్దరూ తమ తండ్రుల పేరును కేవలం ఒక పునాదిగా మాత్రమే ఉపయోగించుకుని, ఆ తర్వాత తమ సొంత ప్రతిభ, కృషి, వ్యూహాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా కొనసాగుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

