Rakhi Sawant | పెండ్లయింది బ్రదర్.. కాస్తా దూరంగా ఉండు.. అప్పుడంటే అది వేరు.. ఇప్పుడు నన్ను తాకలేరు : రాఖీ సావంత్
Rakhi Sawant | ఓ అభిమానిపై చిరు కోపం ప్రదర్శిస్తూ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. గతంలో అయితే వేరే కథ.. ఇప్పుడు పెండ్లయింది.. ముట్టుకోలేరని అభిమానిని రాఖీ వారించింది.
Rakhi Sawant | బాలీవుడ్ సెక్స్ క్వీన్‌గా పేరుగాంచిన రాఖీ సావంత్.. తన చేష్టలతో, మాటలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నది. గత ఏడాది ఫిబ్రవరిలో వాలంటైన్స్ డే రోజున భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కు గురిచేసింది. కాగా, ఏడాది తిరక్కముందే అదిల్ ఖాన్‌ను వివాహమాడి మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు తన అభిమానిపై చిరు ఆగ్రహం ప్రదర్శిస్తూ పాపరాజ్జీలకు చిక్కిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తున్నది.
ముంబైలో రాఖీ సావంత్ కనపడగానే ఓ అభిమాని పరిగెత్తుకెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడ్ని వారించిన రాఖీ సావంత్.. ‘ఓ భయ్యా! నాకు పెళ్లయింది.. కాస్తా దూరం జరుగు..’ అని చెప్పింది. దానికి ఆ అభిమాని ‘అవును.. సరే సరే’ అంటూనే మరోసారి దగ్గరగా వచ్చి సెల్ఫీ తీసుకున్నాడు. దాంతో మరోసారి ‘పెండ్లికాక ముందంటే అది వేరు.. ఇప్పుడు నాకు పెండ్లయింది..’ అంటూ అతడిపై చిరు కోపం ప్రదర్శించింది. పాపరాజ్జీలు రాఖీ సావంత్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఇప్పుడది వైరల్‌గా మారింది. చాలా నిరుత్సాహంగా కూడా కనిపించింది.
ఈ వీడియోపై నెటిజెన్లు చమత్కారంగా కామెంట్లు పెడుతున్నారు. ఆమె నిజంగా ఫన్నీ.. కొత్త పదాలతో వస్తుంటారు అని ఒకరు రాయగా.. రోడ్డు పక్కన సమస్యలకు ఎందుకు పరిష్కారం కనుగొంటున్నారని మరో నెటిజెన్ కామెంట్ చేశారు. ఇంతకు ముందు కూడా పెండ్లయింది కాదా అని ఒకరు రాఖీ సావంత్‌కు పెళ్లయిన విషయాన్ని గుర్తుచేశారు. గత వారం తన ప్రియుడు ఆదిల్ ఖాన్‌తో వివాహాన్ని రాఖీ ధ్రువీకరించింది. తన రహస్య వివాహం గత ఏడాది జూలై 2న జరిగిందని చెప్పి తన పెండ్లి ఫొటోలను Instagram వేదికపై షేర్ చేసుకున్నారు. రాఖీ సావంత్ గతంలో రితేష్ రాజ్‌ను వివాహం చేసుకుంది. సల్మాన్ ఖాన్ రియాల్టీ షో బిగ్ బాస్ 15లో వీరిద్దరూ కలిసి కనిపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

