ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌తో ‘మాయలేడి’
‘రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘మాయలేడి’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఒక ప్రేక్షకుడిగా నాకు ఈ తరహా చిత్రాలంటేనే ఇష్టం. ఈ కథకు ‘మాయలేడి’ అనే టైటిల్ యాప్ట్. ఈ కథలో ఓ ఆసక్తికరమైన ఎలిమెంట్ ఉంటుంది.
‘రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘మాయలేడి’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఒక ప్రేక్షకుడిగా నాకు ఈ తరహా చిత్రాలంటేనే ఇష్టం. ఈ కథకు ‘మాయలేడి’ అనే టైటిల్ యాప్ట్. ఈ కథలో ఓ ఆసక్తికరమైన ఎలిమెంట్ ఉంటుంది. అదేంటో మీరు తెరపైనే చూడాలి’ అని హీరో, నిర్మాత రాకేష్ వర్రే అన్నారు. ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మాయలేడి’. మధుమిత సర్కార్ కథానాయిక. ప్రశంకర్ దర్శకుడు. శుక్రవారం సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రాకేష్ వర్రే విలేకరులతో మాట్లాడారు. ‘రక్తపాతాలతో కూడిన యాక్షన్ కథలు వస్తున్న ఈ రోజుల్లో..
నాకు నచ్చిన జానరైన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతో సినిమా చేస్తే ఆడియన్స్‌కి కాస్త రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుందని ఈ సినిమా చేశాను. అయితే కొత్తదనం లేకుండా సినిమా చేయడం నాకిష్టముండదు. అందుకే కాస్త టైమ్ తీసుకొని విభిన్నమైన వేరియేషన్స్ ఉంటూనే కమర్షియల్‌గా సాగే ఈ కథను తయారుచేశాం. నటుడిగా ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని నాకు కోరిక ఉంది. అయితే.. అలాంటి సినిమాలు చేయాలంటే ముందు నాకు సక్సెస్ రావాలి. ఆ ప్రయత్నంలో భాగమే ఈ ‘మాయలేడి” అని తెలిపారు రాకేష్ వర్రే. కథానాయిక మధుమిత ఇందులో రూప, ఆశ అనే రెండు పాత్రల్ని పోషించిందని, ఆమె పాత్రల్ని థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని, సాంకేతికంగా కూడా సినిమా అలరిస్తుందని రాకేష్ వర్రే చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

