రెండు నియోజకవర్గాల్లో 12.69 లక్షల ఫారాలు స్వీకరణ
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియలో కీలకమైన దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతున్నది. దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లోనే ఉన్నాయి. గురువారం నాటికి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గాల పరిధిలో 12,69,826 ఫారాలు అందగా, 5,54,205 దరఖాస్తులకు ఆమోదం లభించింది. మరో 22,033 దరఖాస్తులు తిరసరణకు గురయ్యాయి. 6,93,588 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉన్నది.
-
6.93 లక్షల దరఖాస్తులు పెండింగ్
-
25 నుంచి ఓటరు నమోదు
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియలో కీలకమైన దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతున్నది. దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లోనే ఉన్నాయి. గురువారం నాటికి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గాల పరిధిలో 12,69,826 ఫారాలు అందగా, 5,54,205 దరఖాస్తులకు ఆమోదం లభించింది. మరో 22,033 దరఖాస్తులు తిరసరణకు గురయ్యాయి. 6,93,588 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉన్నది.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌లో 3.8 లక్షలు పెండింగ్మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని 156 మండలాల నుంచి 5,99,419 దరఖాస్తులు అందాయి. వీటిలో 2,13,952 దరఖాస్తులను ఆమోదించగా, 5,386 తిరసరించారు. మరో 3,80,081 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 3,783 దరఖాస్తులు ప్రాసెస్ కాలేదు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 97,940, మేడ్చల్ మలాజిగిరిలో 1,00,902, హైదరాబాద్‌లో 73,541 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు
తొలి విడత ఆన్లైన్లో ఓటరు నమోదు ఫారం-18 దరఖాస్తులకు సంబంధించిన గడువు ఈ నెల 6వ తేదీతో ముగిసింది. ఏడో తేదీ నుంచి ఆన్లైన్లో ఫారం-18 దరఖాస్తులను తీసుకోవడం లేదు. దరఖాస్తు ఫారాల పరిశీలన ప్రక్రియ, క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ఫిర్యాదుల పరిష్కారం కొనసాగుతుండటంతో ఆన్లైన్లో ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరించడం లేదని సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 25 నుంచి వచ్చే 10 వరకు ఆన్లైన్లో మళ్లీ ఫారం-18 దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నాయి. ఆఫ్‌లైన్‌లో మాత్రం ఫారం-18 దరఖాస్తులు తీసుకుంటున్నట్టు స్పష్టంచేశారు. సీఈవో వెబ్సైట్లో (https:// ceotserms2.telangana.gov.in) నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు దరఖాస్తులు తీసుకుంటామని స్పష్టంగా ఉన్నట్టు వివరించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

