శివకోన, ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేశ్ పాండే ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’. ‘కుటుంబ కథా విచిత్రం’ అనేది ఉపశీర్షిక. శివకోన స్వీయ దర్శకత్వంలో అనిల్ మోదుగతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా చిత్రం నుంచి ‘సునో సునామి’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
దర్శక, నిర్మాత మాట్లాడుతూ ‘రీయూనియన్ బ్యాచ్‌గా కలిసిన కొంత మంది స్నేహితులు సరదగా గడపడానికి ఒక అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఎదురైన విపత్కర పరిస్థితుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన సాహసమే సినిమా కథాంశం. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌తో పాటు అందమైన ప్రేమకథతో తెరకెక్కిస్తున్నాం’ అన్నారు.