OTT Releases | సినిమా థియేటర్లలో సందడి చేసిన చిత్రాలు వరుసగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 7 వరకు పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ నుంచి కామెడీ షోలు, డాక్యుమెంటరీలు, కోర్ట్‌రూమ్ డ్రామాల వరకు ఈ వారం ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 3, 4 తేదీల్లోనే ఎక్కువ సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలోకి రాబోతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ డ్రామా ‘కొరియన్ కనకరాజు’ ఆగస్ట్ 7న థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘DC’ కూడా సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సన్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది మలయాళ స్టార్ కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ఉన్మాదం’ కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 4 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ చూడొచ్చు.
టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాంధారి’ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ కూడా ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో.. జారెడ్ ఫ్రైడ్ (కామెడీ షో – సెప్టెంబర్ 1), అన్‌టోల్డ్ రేగన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ – సెప్టెంబర్ 1), 1000 ఎల్బీ సీజన్ 9 (ఇంగ్లీష్ రియాలిటీ షో – సెప్టెంబర్ 1), లవ్ సిక్ (మెక్సికన్ సిరీస్ – సెప్టెంబర్ 2), టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ – సెప్టెంబర్ 2), ఫిటో పాయెజ్ : ది వరల్డ్ వితిన్ ఏ సాంగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ – సెప్టెంబర్ 3), గాంధారి (తెలుగు డబ్బింగ్ మూవీ – సెప్టెంబర్ 3), ధమాల్ 4 (హిందీ మూవీ – సెప్టెంబర్ 4), ద జెంటిల్‌మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ – సెప్టెంబర్ 3), కొరియన్ కనకరాజు (తెలుగు మూవీ – సెప్టెంబర్ 4), టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ – సెప్టెంబర్ 4), ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్ – సెప్టెంబర్ 4) స్ట్రీమింగ్ కానుంది.
సోని లివ్‌లో.. క్రైమ్ పెట్రోల్ (హిందీ సిరీస్ – ఆగస్ట్ 31), ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ మూవీ – సెప్టెంబర్ 4)న స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జగమే సంగీతం (తెలుగు మ్యూజికల్ సిరీస్ – సెప్టెంబర్ 4),
జియో హాట్ స్టార్ లో ద కోర్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్ – సెప్టెంబర్ 4), సన్ నెక్స్ట్ లో DC (తెలుగు డబ్బింగ్ మూవీ – సెప్టెంబర్ 4), ఆపిల్ టీవీ ప్లస్ లో మేడే (ఇంగ్లీష్ మూవీ – సెప్టెంబర్ 4) స్ట్రీమింగ్ కానుంది.
మొత్తంగా చూస్తే ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్, యాక్షన్, హారర్, కామెడీ, రొమాన్స్, మ్యూజికల్ డ్రామా ఇలా విభిన్న జానర్లలో కంటెంట్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ‘కొరియన్ కనకరాజు’, ‘గాంధారి’, ‘ఉన్మాదం’, ‘DC’, ‘జగమే సంగీతం’ వంటి టైటిల్స్‌పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.