Rajinikanth’s Jailer 2 | సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండగా తాజాగా ఈ చిత్రం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి ‘యూ/ఏ 16 ప్లస్’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సెన్సార్ వివరాల ప్రకారం, ‘జైలర్ 2’ సినిమా నిడివి 165 నిమిషాల 18 సెకన్ల్గా లాక్ చేయబడింది. అంటే ఇది మూడు గంటల కంటే తక్కువ సమయమే ఉంది. 2023లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జైలర్’ రన్‌టైమ్ సుమారు 168 నిమిషాలు కాగా, దానితో పోలిస్తే ఈ సీక్వెల్ కేవలం మూడు నిమిషాలు మాత్రమే తక్కువగా ఉంది. భారీ తారాగణం, కొత్త పాత్రలతో ఈ ఫ్రాంచైజీని మరింత విస్తరిస్తూ నెల్సన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజినీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించనున్నారు. మొదటి భాగం విజయవంతం కాగా, ఈ సీక్వెల్లో ఎస్.జె. సూర్య, విద్యాబాలన్, సూరజ్ వెెంజారమూడు, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ నటులతో పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కూడా తిరిగి తమ పాత్రల్లో అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సెన్సార్ ప్రక్రియ పూర్తి కావడంతో మేకర్స్ ఇప్పుడు రిలీజ్ ఏర్పాట్లతో బిజీగా ఉన్నారు.