దసరా బరిలో ‘వేైట్టెయాన్’
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వేైట్టెయాన్'. ‘జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వేైట్టెయాన్’. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు టీజే జ్ఞానవేల్ గత చిత్రాల తరహాలోనే చక్కటి సామాజిక సందేశం కలబోసిన కథాంశమిదని, ఇందులో రజనీకాంత్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తారని, దుష్టశిక్షణ కోసం ఆయన ఏం చేశారన్నది ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికాసింగ్, దుషరా విజయన్, రోహిణి తదితరులు నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, నిర్మాత: సుభాస్కరన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

