ఫస్టాఫ్ ప్రీక్వెల్ సెకండాఫ్ సీక్వెల్?
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పటివరకూ 171 సినిమాల్లో నటించారు. అయితే ఫ్రాంచైజీ మాత్రం ఆయన చేయలేదు. నిజానికి బాషా, నరసింహ, చంద్రముఖి చిత్రాలకు సీక్వెల్ చేస్తే బావుంటుందనే ప్రపోజల్స్ ఆయనకు వచ్చాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పటివరకూ 171 సినిమాల్లో నటించారు. అయితే ఫ్రాంచైజీ మాత్రం ఆయన చేయలేదు. నిజానికి బాషా, నరసింహ, చంద్రముఖి చిత్రాలకు సీక్వెల్ చేస్తే బావుంటుందనే ప్రపోజల్స్ ఆయనకు వచ్చాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించారు తలైవా. కానీ తొలిసారి ‘జైలర్’ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. దానికి కారణం నెల్సన్ కుమార్ చెప్పిన కథేనని వినికిడి.
‘జైలర్’లో ఆయన రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఓ రిటైర్డ్ జైలర్ భయంకరమైన ఓ మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా కుప్పకూల్చాడనేది ‘జైలర్’ కథ. అయితే.. ‘జైలర్ 2’ స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు నెల్సన్ కుమార్ విభిన్నంగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది.
ఇందులో రిటైర్ కాకముందు, డ్యూటీలో ఉన్నటువంటి ముత్తువేల్ పాండియన్ జీవితాన్ని చూపిస్తాడట నెల్సన్. ప్రథమార్ధమంతా ఆన్ డ్యూటీ జైలర్ కనిపిస్తాడట. అంటే ఓ విధంగా ప్రీక్వెల్ అన్నమాట. ఇక ద్వితీయార్ధం మాత్రం ‘జైలర్’కు సీక్వెల్‌గా సాగుతుందట.
ఈ క్రమంలో రజనీకాంత్‌పై తీసిన కొన్ని సన్నివేశాలు గూజ్బంప్స్ తెప్పిస్తాయని ఇన్సైడ్ టాక్. సెప్టెంబర్ 4న సినిమా విడుదల కానున్నది. ఎస్జే సూర్య విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, మిథున్ చక్రవర్తి, విజయ్‌సేతుపతి ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాణం: సన్‌పిక్చర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

