annathe teaser | రజనీకాంత్ ప్రస్తుతం అన్నాతే సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు సూపర్ స్టార్. శౌర్యం శివ ఈ సినిమాకు దర్శకుడు. తమిళంలో వరుసగా అజిత్ హీరోగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకున్న శివ.. తొలిసారి రజనీకాంత్ తో పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా రజినీ కూడా పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోతున్నాడు. అభిమానులకు ఈయన చాలా బాకీ పడిపోయాడు. ఇలాంటి సమయంలో అభిమానుల అంచనాలు అన్నాత్తే సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ అందుకుంటామని రజినీ కూడా ధీమాగా ఉన్నాడు. ఎన్నో బ్రేకుల మధ్య అన్నాత్తే సినిమా షూటింగ్ పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇది చూశాక సినిమాపై క్లారిటీ వచ్చింది.
ఇప్పటికే అన్నాత్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తయ్యాయి. చిన్న చిన్న వర్కులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఎక్కువ భాగం షూటింగ్ చేశాడు దర్శకుడు శివ. గతంలో వేదాళం సినిమాను కూడా ఎక్కువభాగం కోల్‌కతాలోనే తెరకెక్కించాడు శివ. ఇప్పుడు మరోసారి రజనీకాంత్ కోసం అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. అన్నాత్తే సినిమా టీజర్ పక్కా మాస్‌గా ఉంది. రజినీకాంత్ ను అంత మాస్‌గా చూసి చాలా ఏళ్లవుతుంది. పేట సినిమాలో కాస్త ట్రై చేసినా కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు శివ బాగానే చూపిస్తున్నాడు. అన్నాత్తే సినిమాలో జగపతిబాబు, కుష్బూ, నయనతార, కీర్తి సురేశ్, మీనా లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఒకే సినిమాలో ఇంత మందిని కలిపి చూపిస్తున్నాడు శివ.
ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు వర్షన్‌కు చిరంజీవి సూపర్ హిట్ టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. అదే అన్నయ్య.. 2000 సంవత్సరంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మిలీనియం మొదటి బ్లాక్ బస్టర్‌గా అన్నయ్య చరిత్ర సృష్టించింది. అలాంటి టైటిల్ రజిని సినిమా కోసం ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. అన్నాతే అంటే అన్నయ్య అని అర్థం. దాంతో అదే టైటిల్ రజినీకాంత్ ఇమేజ్ కు బాగా సరిపోతుంది అనుకుంటున్నారు మేకర్స్. ఈ మధ్య చిరంజీవి పాత టైటిల్స్ తో చాలా సినిమాలు వచ్చాయి. తమిళ హీరో కార్తీ దొంగ, ఖైదీ టైటిల్స్ వాడుకున్నాడు. మొన్న కార్తికేయ రాజా విక్రమార్క అంటూ వచ్చాడు. ఇప్పుడు రజినీకాంత్ అన్నయ్య అంటున్నాడు. మరి ఇది ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Maa elections | ఒక్క ఓటమితోనే మెగా ఫ్యామిలీ సత్తా తగ్గిపోతుందా..?
MAA elections ఎఫెక్ట్.. మెగా హీరోల బ్లాక్ లిస్ట్‌లో నరేశ్ సహా ఇతర నటులు !
SPB last song | రజినీకాంత్ కోసం ఎస్పీ బాలు పాడిన చివరి పాట వచ్చేసిందిగా..
Srikanth: రజనీకాంత్ ప్రియమైన స్నేహితుడు కన్నుమూత.. తీవ్ర విషాదంలో తలైవా..!
Aishwarya: తెలుగులో స్ట్రైట్ మూవీ చేయనున్న రజనీకాంత్ కూతురు
మోహన్ బాబును దొంగ నా కొడుకు అని తిట్టిన స్టార్ హీరో ఎవరు..?