Rajendra Prasad look | ‘శాసనసభ’లో ఎమ్మెల్యేగా డా.రాజేంద్రప్రసాద్..ఫస్ట్ లుక్ పోస్టర్
సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న మూవీ శాసనసభ (Sasana sabha). తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి వేణు మడికంటి (Venu Madikanti) దర్శకుడు.
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా రూపొందుతున్న పాన్ఇండియా చిత్రం శాసనసభ (Sasana sabha). సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి వేణు మడికంటి (Venu Madikanti) దర్శకుడు.
కాగా ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా సోమవారం విడుదల చేసింది చిత్రబృందం..ఈ సందర్భంగా నిర్మాతలు తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని మాట్లాడుతూ.. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ గారు ఎమ్మేల్యే నారాయణస్వామిగా నటిస్తున్నారు. విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన పాత్ర ఎంతో అద్భుతంగా వుంటుంది.
ఇప్పటి వరకు ఆయన కెరీర్లో పోషించనటువంటి విభిన్నమైన పాత్ర ఇది. చిత్రంలో ఈ పాత్ర ఎంతో హైలైట్‌గా వుంటుంది. మా చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవిబస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఆయన నేపథ్య సంగీతంతో విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు అనూహ్య స్పందన దక్కింది. సినిమా కూడా తప్పకుండా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది అన్నారు.
ఈ చిత్రానికి కథ-మాటలు: రాఘవేందర్ రెడ్డి, సంగీతం: రవిబసుర్, ఆర్ట్: కేవీ రమణ, కెమెరా: మురళీకృష్ణ. కన్నడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా పేరుపొందిన తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
https://twitter.com/madurimadhu1/status/1559017220411654145
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

