Rajeev kanakala | రాజీవ్ కానకాల అక్కడికి కానీ వెళ్తే రాళ్లు, చెప్పులతో కొడతారంట..

rajeev kanakala | అదేంటి.. అంత పెద్ద తప్పు రాజీవ్ కానకాల ఏం చేశాడు అనుకుంటున్నారా.. ఒక నటుడిని ఆయన చేసిన పాత్రలు చూసి ప్రేక్షకులు అసహ్యించుకుంటున్నారు అంటే అంతకంటే గొప్ప ప్రశంస మరొకటి లేదు. ఇప్పుడు రాజీవ్ కానకాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ మధ్య లవ్ స్టోరీ ( love story ) సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. అయితే అదే అన్ని సినిమాల్లో ఉండే ప్రతినాయకుడి పాత్రలాంటిది కాదు. సొంత అన్న కూతుర్నే ఎనిమిదేళ్ల వయసులో లైంగికంగా వేధించే క్రూరమైన బాబాయ్ పాత్ర ఇది. ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి సాధారణంగా ఎలాంటి నటుడు కూడా ముందుకు రాడు. శేఖర్ కమ్ముల కూడా రాజీవ్ కానకాలతో ఈ పాత్రను చేయించడానికి చాలా కష్టపడ్డాడు.

ముందు విలన్ పాత్ర అని చెబితే రాజీవ్ ఒప్పుకున్నాడు. కానీ లవ్ స్టోరీ కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ చేయడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. ఇదే విషయం తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల. శేఖర్ కమ్ముల కథ చెప్పిన తర్వాత ఈ పాత్రపై భయమేసింది అంటున్నాడు రాజీవ్. బాబాయ్ కాకుండా మేనమామగా ఈ క్యారెక్టర్ మార్చాలని ఎంతో అడిగానని.. అయితే సమాజంలో జరుగుతున్న వాస్తవిక సంఘటనలు చూపించనున్నట్లు శేఖర్ కమ్ముల తనకు చెప్పాడని రాజీవ్ కానకాల తెలిపాడు. అందుకే ఎంత అడిగినా కూడా పాత్ర మార్చలేదని.. ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత తనకు ప్రశంసలు ఎన్ని వస్తున్నాయో విమర్శలు కూడా అన్ని వస్తున్నాయి అంటున్నాడు ఈ సీనియర్ నటుడు.
బీ, సీ సెంటర్లలో తను గానీ థియేటర్‌కి వెళ్తే కచ్చితంగా రాళ్లు చెప్పులతో కొడతారని రాజీవ్ కానకాల తెలిపారు. దీన్ని బట్టి ప్రేక్షకుల తన పాత్రను ఎంతగా అసహ్యించుకుంటున్నారో అర్థమైంది అంటున్నాడు. ఒక నటుడికి ఇంతకంటే గొప్ప ప్రశంస ఇంకేం కావాలి అని ప్రశ్నిస్తున్నారు ఈయన. నిజానికి మంచి నటుడే అయినా కూడా రాజీవ్ కనకాలను మన తెలుగు దర్శకులు ఎందుకో సరిగ్గా వాడుకోవడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నా భర్త అలాంటి వాడే.. రాజీవ్ కనకాలపై సుమ కీలక వ్యాఖ్యలు
సుమతో అందుకే విడిగా ఉండాల్సి వచ్చింది: రాజీవ్ కనకాల
సమంతకు అసలు పరీక్ష ఇప్పట్నుంచే మొదలు కానుందా..?
Maa elections | మా ఎన్నికలపై ఆ స్టార్ హీరోల అసంతృప్తి.. ఓటు వేయరా..?
Maa Elections | ఈవీఎంలపై నమ్మకం లేదని లేఖ రాసిన మంచు విష్ణు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

