Tollywood | మళ్లీ అలాంటి పాత్రలు ఒప్పుకుంటున్న రాజశేఖర్ !
Rajashekar | 90ల్లో చిరంజీవి, బాలయ్యతో సమానంగా మంచి సినిమాలు చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రాజశేఖర్. అప్పట్లో ఈయనకు కూడా అభిమాన సంఘాలు ఉండేవి. అయితే

Rajashekar | 90ల్లో చిరంజీవి, బాలయ్యతో సమానంగా మంచి సినిమాలు చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రాజశేఖర్. అప్పట్లో ఈయనకు కూడా అభిమాన సంఘాలు ఉండేవి. అయితే రానురాను ఈయన మార్కెట్ పడిపోయింది. కానీ ఇప్పటికీ రాజశేఖర్ అంటే అభిమానించే వాళ్లు మాత్రం అలాగే ఉండిపోయారు. 2000కు ముందు వరకు కూడా రాజశేఖర్ సినిమాలు బాగానే ఆడాయి. వరస విజయాలు కూడా అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఈయన మెల్లగా కనుమరుగు అవుతూ వచ్చాడు. అప్పుడప్పుడూ ఒకట్రెండు సినిమాలతో మెరవడమే కానీ విజయం అందించింది మాత్రం తక్కువే.
80ల్లో తలంబ్రాలు, వందేమాతరం లాంటి సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి.. అంకుశం, మగాడు లాంటి సినిమాలతో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనిపించుకున్నాడు రాజశేఖర్. ఆ తర్వాత అన్న, అల్లరి ప్రియుడు, మా ఆయన బంగారం, శివయ్య, మనసున్న మారాజు, మా అన్నయ్య, సింహరాశి, ఎవడైతే నాకేంటి, గోరింటాకు లాంటి విజయాలతో తన రేంజ్ పెంచుకున్నాడు. అయితే ఒకానొక సమయంలో రాజశేఖర్ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కనీసం ఈయన సినిమా వచ్చిందంటే పట్టించుకున్న వాళ్లు కూడా లేరు. గడ్డం గ్యాంగ్ వంటి సినిమాలు ఎప్పుడొచ్చాయో కూడా తెలియదు. వాటిని సొంతంగా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు రాజశేఖర్. అలాంటి సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక చెన్నైలో ఉన్న తన రెండు ఇండ్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ తన వాళ్లతో రాజశేఖర్ చెప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో చాలా ఏండ్లకు PSV గరుడ వేగ సినిమాతో ఉనికి చాటుకున్నాడు రాజశేఖర్. ఆ తర్వాత కల్కి సినిమా కూడా ఫర్లేదు అనిపించింది. దీంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈయన.. వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ విలన్‌గా మారుతున్నాడు రాజశేఖర్.
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులో ప్రతినాయకుడిగా రాజశేఖర్ నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. నిజానికి రాజశేఖర్ ఇండస్ట్రీకి వచ్చింది విలన్‌గానే. కెరీర్ మొదట్లో తలంబ్రాలు, ఆహుతి సినిమాల్లో ఈయన విలనిజానికి అంతా ఫిదా అయ్యారు. ఆ తర్వాత హీరోగా బిజీ అయిపోయాడు. అయితే కొన్నేండ్ల కింద రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ధృవ సినిమాలో విలన్‌గా రాజశేఖర్‌ను అడిగినా కుదర్లేదు. కానీ ఇప్పుడు మళ్లీ ఇన్నేండ్లకు ఈయన విలనిజం వైపు అడుగులేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
స్టార్ హీరోయిన్ ఇంట్లో డ్రగ్స్, మద్యం లభ్యం..అదుపులోకి తీసుకున్న పోలీసులు
కియారాను నయనతారతో పోల్చిన డైరెక్టర్
సమంత రిస్కీ వర్కవుట్స్ వీడియో వైరల్
బాలకృష్ణ మూవీ..సింపుల్‌గా తప్పించుకున్న శృతిహాసన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

