ఆ లోటే నన్ను బాధించింది
తెలుగు తెరపై వచ్చినన్ని పౌరాణిక చిత్రాలు ఇతర భాషల్లో రాలేదనే చెప్పాలి. వెండితెరపై పౌరాణిక ఇతిహాసాలకు, పురాణ పాత్రలకూ తమ సృజనాత్మకతతో ప్రాణప్రతిష్ట చేసి, తెలుగు సినిమాకే గౌరవం తెచ్చారు నాటి దర్శకులు.
తెలుగు తెరపై వచ్చినన్ని పౌరాణిక చిత్రాలు ఇతర భాషల్లో రాలేదనే చెప్పాలి. వెండితెరపై పౌరాణిక ఇతిహాసాలకు, పురాణ పాత్రలకూ తమ సృజనాత్మకతతో ప్రాణప్రతిష్ట చేసి, తెలుగు సినిమాకే గౌరవం తెచ్చారు నాటి దర్శకులు. అయితే.. వెండితెరపై వచ్చిన పౌరాణికాల విషయంలో తానెప్పుడూ సంతృప్తి చెందలేదని నిర్మొహమాటంగా చెప్పారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ ‘నాకు పౌరాణికాలంటే ఇష్టం. అయితే.. వాటిని తెరకెక్కించిన విధానం విషయంలో మాత్రం సంతృప్తిగా లేను. తెరపై వాటికి పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. ఆ ఇతిహాసాలను రాసిన విధానానికీ, వాటిని తెరపైకి తెచ్చిన విధానానికీ చాలా వ్యత్యాసం ఉంది.
ఆ లోటే నన్ను చాలా రోజులు బాధించింది. ఇప్పుడు దర్శకునిగా వాటిని తెరకెక్కించే అవకాశం నాకూ రావడంతో ‘ నువ్వేం చేయబోతున్నావ్?.. వాటిని ఎలా తీయబోతున్నావ్?’ అని నాకు నేనే ప్రశ్నించుకున్నా. దీన్ని ఓ సవాలుగా స్వీకరించి ‘వారణాసి’లో కొంత భాగం రామాయణాన్ని తెరకెక్కించాను’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచారు రాజమౌళి. ఇందులో మహేశ్ రుద్రగా, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్న విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

