రాజ్‌కుంద్రా పోలీసులకు 25 లక్షల లంచం ఇచ్చాడు!

ముంబై: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ వీడియోల కేసులో అరెస్ట్ తప్పించుకోవడానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు రూ.25 లక్షల లంచం ఇచ్చాడు. అందుకే అతన్ని ఇన్నాళ్లూ అరెస్ట్ చేయకుండా పోలీసులు ఆగారు అని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆరోపించారు. ఈ రాకెట్లో ప్రధాన సూత్రధారి అరవింద్ శ్రీవాస్తవ అలియాస్ యశ్ ఠాకూర్ అనే వ్యక్తికి చెందిన సంస్థ గత మార్చిలోనే ఈ విషయాన్ని ఏసీబీకి మెయిల్ ద్వారా చెప్పినట్లు మిడ్డే వెల్లడించింది. గత ఏప్రిల్‌లో ఏసీబీ దీనిని ముంబై పోలీస్ చీఫ్‌కు పంపించింది. అయితే ఈ ఆరోపణలపై ముంబై పోలీస్ అధికారులు మాత్రం ఏమీ స్పందించలేదు.
ఈ ఫిర్యాదు చేసింది అరవిండ్ శ్రీవాస్తవకు చెందిన ఫ్లిజ్ మూవీస్. ఇదొక అమెరికా సంస్థ. ఈ కేసులో సంస్థ పేరును చేర్చిన పోలీసులు శ్రీవాస్తవకు చెందిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. ఆ అకౌంట్లలో రూ.4.5 కోట్ల మొత్తం ఉంది. అంతే మొత్తం ఇవ్వాలని తన సంస్థను కూడా ఓ పోలీస్ ఇన్ఫార్మర్ ద్వారా డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. మరోవైపు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రా ఆదేశాలపై చిత్రీకరించిన 70 పోర్న్ వీడియోలపై విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

