Raghavendra Rao K | భారత ప్రభుత్వానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విజ్ఞప్తి.. వీడియో వైరల్
Raghavendra Rao K | సినీ, రాజకీయ రంగంలో దివంగత లెజెండరీ నటులు నందమూరి తారకరామారావు (Sr NTR) చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ.. భారత ప్రభుత్వం ఆయన పేరు మీద 100 రూపాయల నాణాన్ని విడుదల చేసిందని తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (Raghavendra Rao K)కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Raghavendra Rao K | తెలుగు సినిమా ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటిన వ్యక్తుల్లో టాప్లో ఉంటారు దివంగత లెజెండరీ నటులు నందమూరి తారకరామారావు (Sr NTR). సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ.. భారత ప్రభుత్వం ఆయన పేరు మీద 100 రూపాయల నాణాన్ని విడుదల చేసిందని తెలిసిందే. ఈ ప్రత్యేకమైన క్షణాలను తెలుగు ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (Raghavendra Rao K)కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
నాకు దైవసమానులైన నందమూరి తారకరామారావు పేరుతో 100 రూపాయల నాణాన్ని (100 Coin) భారత ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్ట్స్ త్వరలోనే ఆయనకు భారతప్రభుత్వం (Bharat Ratna) భారతరత్న (దేశ అత్యున్నత పౌర పురస్కారం) బిరుదు ఇస్తే.. తెలుగు జాతి నిజంగా గర్వించదగిన రోజు అవుతుంది. ఆ పనిని కూడా అందరూ కలిసి త్వరగా పూర్తి చేస్తారని నమ్ముతూ.. మీ రాఘవేంద్రరావు.. అంటూ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరి దర్శకేంద్రుడి విజ్ఞప్తికి కేంద్రం ఎలా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వానికి, భారతీయ సినిమా, రాజకీయాలపై ఆయన చూపిన శాశ్వత ప్రభావానికి గొప్ప ప్రాముఖ్యత లభించినట్లవుతుందని అంటున్నారు సినీ జనాలు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విజ్ఞప్తి..
We Demand Bharat Ratna for NTR Garu#bharatrathna #ntr pic.twitter.com/r9k06SGSvL
— Raghavendra Rao K (@Ragavendraraoba) August 29, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

