Raghava Lawrence | స్టూడెంట్‌కు క్షమాపణలు చెప్పిన రాఘవ లారెన్స్.. ఎందుకంటే
Chandramukhi 2 | కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్రలో దర్శకుడు పి. వాసు (P. Vasu) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి2 (Chandramukhi 2). ఈ సినిమా 2004లో సూపర్ హిట్‌గా నిలిచిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా రానుంది.
Chandramukhi 2 | కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్రలో దర్శకుడు పి. వాసు (P. Vasu) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి2 (Chandramukhi 2). ఈ సినిమా 2004లో సూపర్ హిట్‌గా నిలిచిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా రానుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు.. పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇక రీసెంట్గా చంద్రముఖి 2 ఆడియో లాంచ్ (Chandramukhi 2 Audio Launch) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్లో ఓ బౌన్సర్‌కు స్టూడెంట్‌కు మధ్య గొడవ జరిగింది. తాజాగా ఈ ఘటనపై రాఘవ లారెన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. స్టూడెంట్‌కు క్షమాపణలు (Lawrence apologies to Student) తెలిపాడు.
‘అందరికి నమస్కారం. చంద్రముఖి 2 సినిమా ఆడియో లాంచ్ (Chandramukhi 2 Audio Launch) సందర్భంగా బౌన్సర్లలో ఒకరు కాలేజీ స్టూడెంట్‌తో గొడవకు దిగిన దురదృష్టకర సంఘటన గురించి నాకు ఇప్పుడే తెలిసింది. ముందుగా ఈ సంఘటన గురించి నాకు తెలియదు, ఆడియో లాంచ్ జరుగుతున్నప్పుడు ఈ ఘటన బయట జరిగింది. నేను విద్యార్థులను ఎంతగా ప్రేమిస్తానో, వారు ఎదగాలని నేను ఎంతగా కోరుకుంటానో అందరికీ తెలుసు. నేను గొడవలకు చాలా దూరంగా ఉంటాను. మనం ఎక్కడికి వెళ్లినా ఆనందం, శాంతి ఉండాలని కోరుకుంటాను. కారణం ఏమైనప్పటికీ, ఎవరినైనా కొట్టడం ఖచ్చితంగా తప్పు. ముఖ్యంగా స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఇది జరగకూడదు. ఆడియో లాంచ్‌లో ఇలా జరగడంపై నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. ఇక నుంచైనా బౌన్సర్లు ఇటువంటి కార్యకలాపాలలో పాల్గొనవద్దని నేను మనస్పూర్తిగా అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు.’ అంటూ లారెన్స్ ఎక్స్‌లో రాసుకోచ్చాడు.
సుబాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Hello everyone, I just came to know about the unfortunate incident which happened during our #Chandramukhi2 movie Audio Launch, where one of the Bouncers involved in a fist fight with a college student.
First of all myself or the organisers were not aware of this incident as it…
— Raghava Lawrence (@offl_Lawrence) August 27, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

