Raashii Khanna | విఫల ప్రేమ.. బ్రేకప్ వల్ల డిప్రెషన్లోకి వెళ్లా: రాశీఖన్నా
కెరీర్ ఆరంభంలో దక్షిణాదిలో ఓ వెలుగువెలిగింది పంజాబీ భామ రాశీఖన్నా. ‘థాంక్యూ’ సినిమా తర్వాత టాలీవుడ్లో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నది. హిందీలో ఆమె నటించిన ‘ది సబర్మతీ రిపోర్ట్' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
Raashii Khanna | కెరీర్ ఆరంభంలో దక్షిణాదిలో ఓ వెలుగువెలిగింది పంజాబీ భామ రాశీఖన్నా. ‘థాంక్యూ’ సినిమా తర్వాత టాలీవుడ్లో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నది. హిందీలో ఆమె నటించిన ‘ది సబర్మతీ రిపోర్ట్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. గుజరాత్ గోద్రా రైలు దహనం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్లో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది రాశీఖన్నా. గతంలో తాను ప్రేమలో ఉన్నానని, అనుకోని కారణాల వల్ల బ్రేకప్ అయిందని తన విఫల ప్రేమను తలచుకొని భావోద్వేగానికి గురైంది. రాశీఖన్నా మాట్లాడుతూ ‘నేను చాలా సున్నిత మనస్కురాలిని.
కొన్నేళ్ల క్రిందట ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. కానీ దురదృష్టవశాత్తు మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. కొన్ని నెలల పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయా. ఆ తర్వాత ధై ర్యాన్ని కూడగట్టుకొని కెరీర్ మీద దృష్టి పెట్టాను. నా శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల మద్దతు వల్ల ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడ్డా’ అని చెప్పింది. అ యితే తనతో ప్రేమాయణం నడిపిన వ్యక్తి గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు రాశీఖన్నా. దాంతో సదరు వ్యక్తి ఎవరోనని అభిమానులు ఆరా తీస్తున్నారు. రంజన్ చందేల్ దర్శకత్వం వహించిన ‘ది సబర్మతీ రిపోర్ట్’ ఈ నెల 15న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

