‘రాజభవనాన్ని తలపించే అంతఃపురంలో యువరాణి లాంటి ఓ అందాల బొమ్మ ఉంటుంది.నచ్చిన చెలికాడు తోడుగా ఆ అంతఃపురంలో ఆనందంగా జీవితాన్ని సాగించాల్సిన ఆమె కొన్ని అదృశ్యశక్తుల కారణంగా భయపడుతుంది. ఆ అందాల రాణి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు సుందర్.సి. ఆయన దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అంతఃపురం’. ఆర్య, రాశీఖన్నా, ఆండ్రియా కీలక పాత్రల్ని పోషించారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ నెల 31న విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘హారర్ కామెడీ చిత్రమిది. ఓ జంట ప్రేమప్రయాణానికి కొన్ని ఆత్మలు ఎలాంటి అడ్డంకులను సృష్టించాయన్నది భయపెడుతూనే నవ్విస్తుంది. రాశీఖన్నా గ్లామర్ ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి యాక్షన్: పీటర్ హెయిన్.