Ra Rammandhi uru Song | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ అటు హీరోగా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు సత్యదేవ్. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్సె’. ‘బ్లఫ్ మాస్టర్’ ఫేం గోపి గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. యాక్షన్ థిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ఇస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
‘రా రామ్మంది ఊరు’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్యశాస్త్రీ సాహిత్యాన్ని అందించాడు. రామ్ మిర్యాల ఆలపించాడు. ఈ పాటలో పల్లె అందాలు, ఫ్రెండ్స్ రీ యూనియన్, హీరో చిన్ననాటి జ్ణాపకాలు వంటివి మన స్కూల్ డేస్‌ను గుర్తుచేస్తున్నాయి. సునిల్ కశ్యప్, సాండి అడ్డంకీ సంగీతం వినపొంపుగా ఉంది. సురేష్ కెమెరా విజువల్స్ బాగున్నాయి. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా మలయాళ కుట్టి ఐశ్వర్య హీరోయిన్గా నటించింది. నాగబాబు కీలకపాత్రలో నటించాడు. అవినీతిమైన రాజకీయనాయకులను, ఒంటి చేత్తో ఎదుర్కొన్న యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించాడు.