Anakapalli | పుష్ప 2 విలన్ తారక్ పొన్నప్ప వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’ (Anakapalli). నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫేమ్ యాక్టర్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంటెన్స్ పల్లెటూరి యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విక్రమ్ సాహిదేవ్ తన సరికొత్త లుక్, పవర్ఫుల్ యాక్టింగ్‌తో ఇంప్రెస్ చేస్తున్నాడు.
ఈ వేసవి కానుకగా అనకాపల్లి ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్గా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సీనియర్ నటి సంగీతపై వచ్చిన అమ్మోరు దిగినాది సాంగ్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మేకర్స్ లబ్బరు బొమ్మ సాంగ్‌ను విడుదల చేశారు. కృష్ణ చైతన్య, సాహితీ చాగంటి పాడిన ఈ పాట మాస్ సాంగ్స్‌ను ఇష్టపడే మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేయడం పక్కా అని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఇక ఈ పాటలో తారక్ పొన్నప్ప మాస్ స్టెప్పులతో ఇరగదీస్తున్నాడు. అనకాపల్లి సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా
ఈ చిత్రానికి దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించగా.. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నాడు. అనకాపల్లి మూవీలో త్రినాధరావు నక్కిన కీ రోల్లో నటిస్తుండట విశేషం. ఇంద్రజ అబ్బర్, మహబూబ్‌నగర్ భాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందినీ రాయ్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నక్కిన నరేటివ్స్, భవ్య శ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై త్రినాథరావు నక్కిన, నాయుడు కాండ్రేగుల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డావ్జాండ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
#LabbaruBomma is pure festival fire.
Catchy beats, foot tapping music, and non stop glamour light up the screen. This item number from #Anakapalli brings energy and style.🎬 #Anakapalli Coming to theatres this Summer 2026 🍿@TrinadharaoNak1… pic.twitter.com/79RJRJq8D6
— BA Raju’s Team (@baraju_SuperHit) May 8, 2026
Sanjeev Arora: మంత్రి సంజీవ్ అరోరాను అరెస్టు చేసిన ఈడీ
Ravi Teja | ఫుల్ స్వింగ్‌లో రవితేజ ‘ఇరుముడి’.. షూటింగ్ చివరి దశకు చేరిన మాస్ మహారాజ మూవీ!