Pushpa The Rule | నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు పలువురు సెలబ్రిటీలు బన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). ఈ సినిమాకు లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ భామ రష్మిక మందన్నామరోసారి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా నుంచి నేడు బన్ని బర్త్ డే కానుకగా టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. గంగమ్మ తల్లి జాతరలో అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ ఫైట్ సీన్‌తో ఫుల్ యాక్షన్ ప్యాక్ట్డ్గా సాగింది ఈ టీజర్. ఇక నెట్టింట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నా టీజర్‌ను మీరు చూసేయండి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న సీక్వెల్ ప్రాజెక్టులో కన్నడ భామ రష్మిక మందన్నామరోసారి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శ్రీవల్లిగా డీగ్లామరైజ్డ్ రోల్లో కనిపించనుంది . పార్టు 2లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.