Srivalli | శ్రీవల్లి.. ఈ రోజే పుట్టిన జాబిల్లి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని ఐకాన్‌స్టార్‌గా మార్చేసిన సినిమా ‘పుష్ప’. అంతేకాదు, దర్శకుడిగా సుకుమార్‌కి పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను కట్టబెట్టిన సినిమా కూడా ‘పుష్ప’నే. ఇక రష్మిక అయితే.. ఈ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఆ సినిమాలో శ్రీవల్లిగా ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
Srivalli | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని ఐకాన్‌స్టార్‌గా మార్చేసిన సినిమా ‘పుష్ప’. అంతేకాదు, దర్శకుడిగా సుకుమార్‌కి పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను కట్టబెట్టిన సినిమా కూడా ‘పుష్ప’నే. ఇక రష్మిక అయితే.. ఈ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఆ సినిమాలో శ్రీవల్లిగా ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఓ విధంగా ‘పుష్ప’ వల్ల కొందరి జీవితాలు సమూలంగా మారిపోయాయనే చెప్పాలి. దాంతో ఇప్పుడు ‘పుష్ప-2’ ‘ది రూల్’ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణదశలో ఉంది. ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు కూడా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను మేకర్స్ మొదలుపెట్టారు. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందనే వచ్చింది. రష్మిక మందన్న పుట్టినరోజును పురస్కరించుకొని శుక్రవారం శ్రీవల్లి న్యూ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. పట్టు వస్ర్తాలు, బంగారు ఆభరణాలు ధరించి, వెరైటీ ఎక్స్ప్రెషన్తో మెరిసిపోతున్నది అందాల రష్మిక. ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్.
ఇదిలావుంటే.. రష్మిక పుట్టినరోజు సందర్భంగా మరో సినిమా లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆ సినిమానే ‘ది గర్ల్ ఫ్రెండ్’. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ సమర్పణలో మాస్ మూవీమేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆమెకు జోడీగా ‘దసరా’ఫేం దీక్షిత్‌శెట్టి నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఇందులో రష్మిక కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 60శాతం పూర్తయిందని మేకర్స్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

