దేశవ్యాప్తంగా ‘పుష్ప-2’ మేనియా మొదలైంది. సరికొత్త అప్డేట్లను అందిస్తూ చిత్ర బృందం ప్రచారంలో జోరు పెంచింది. సుకుమార్ దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
విడుదలకు ఇంకా మూడు మాసాలకుపైగా సమయం ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతున్నది. మ్యూజిక్ ప్రమోషనల్లో భాగంగా ‘పుష్ప..పుష్పరాజ్’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియోను నేడు విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో అల్లు అర్జున్ మాస్ గెటప్‌లో దర్శనమిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ సినిమా గీతాలు తొలిభాగం తరహాలోనే సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తాయని మేకర్స్ చెబుతున్నారు. రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబో బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్.బి.