పవన్‌కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ‘పురుషః’. వీరు వులవల దర్శకుడు. బత్తుల కోటేశ్వరరావు నిర్మాత. సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ కీలక పాత్రధారులు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరాయి.
మే నెలలో విడుదల కానున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని, సుధీర్, అనంత్‌శ్రీరామ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, సమర్పణ: సరస్వతి బత్తుల, నిర్మాణం: కల్యాణ్ ప్రొడక్షన్స్.