కన్నడనాట మొదలైన పునీత్ రాజ్ కుమార్ దండయాత్ర..
Puneeth Rajkumar James Movie | ఏడాది కింది వరకు పునీత్ రాజ్ కుమార్ సినిమా కన్నడ విడుదలైతే ఒక సెలబ్రేషన్.. కానీ ఇప్పుడు మాత్రం ఒక ఎమోషన్. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో గతేడాది అక్టోబర్ 29న అనూహ్యంగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ మరణం తర్వాత కర్ణాటకలో చోటు చేసుకున్న సంఘటనల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మరణవార్త విని తట్టుకోలేక 21 మంది అభిమానులు చనిపోయారు. దాన్ని బట్టి ఆయన ఎంత పెద్ద హీరో అనేది మనకు అర్థం అవుతుంది. చాలా రోజుల తర్వాత కర్ణాటకలో మరోసారి పునీత్ స్మరణ జరుగుతుంది. దానికి కారణం మార్చి 17న ఆయన జయంతి. దాంతో అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.

ఆరోజు కేవలం ఆయన జయంతి మాత్రమే కాదు పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్ విడుదల కూడా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది జేమ్స్. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఒకే రోజు విడుదల చేస్తున్నారు. కన్నడలో అయితే ఇప్పటి వరకు మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో జేమ్స్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మొదటి రోజు ఏకంగా 4 వేల షోలు పడబోతున్నాయి.
మార్చి 16 అర్ధరాత్రి నుంచే హంగామా మొదలు కానుంది. రికార్డు స్థాయిలో ప్రీమియర్ షోస్ కూడా ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే తొలి మూడు రోజుల టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు.. కానీ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా అనే బ్రాండ్ మాత్రం ఉంది. దానివల్ల ఏవైనా ఓపెనింగ్స్ వస్తాయి అనేది చూడాలి. మొత్తానికి చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక భారీ సినిమా విడుదల అవుతుండటం.. అందులోనూ అది పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా కావడంతో ఎమోషన్, సెలబ్రేషన్ రెండు కలిపి వస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

