మరణానంతరం పునీత్ రాజ్‌కుమార్ మరో అరుదైన ఘనత..

Puneeth rajkumar | చూస్తుండగానే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణించి 50 రోజులు దాటిపోయింది. అక్టోబర్ 29న ఈయన అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన చనిపోయిన తర్వాత దాదాపు నెల రోజుల వరకు కన్నడిగులు కోలుకోలేకపోయారు. ఎక్కడ చూసినా కూడా పునీత్ నామస్మరణే కనిపించింది. ముఖ్యంగా అభిమానులు అయితే ఇప్పటికీ ఆ షాక్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అప్పు లేడన్న నిజాన్ని.. వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యే ఈయన నటించిన చివరి సినిమా గందధ గుడి టీజర్ విడుదలైంది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అడవులు, జంతువుల పరిరక్షణ కోసం పునీత్ చేసిన సినిమా ఇది. దీన్ని సినిమా అనేకంటే కూడా డాక్యుమెంటరీ అంటే కరెక్ట్ అనిపిస్తుంది. అయితే పునీత్ మరణం తర్వాత ఈ డాక్యుమెంటరీని సినిమాగా మార్చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. దీనికోసం పునీత్ అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.
ఇదిలా ఉంటే పునీత్ రాజ్‌కుమార్ మరణించిన తర్వాత అతడిని చాలా అరుదైన గౌరవాలు పలకరిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం బసవ శ్రీ, కర్ణాటక రత్న అవార్డులు ఇచ్చి సత్కరించారు. ఇవి కన్నడిగులకు ఇచ్చే అత్యున్నత పురస్కారాలు. ఆ తర్వాత పద్మ శ్రీ కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు పునీత్ రాజ్‌కుమార్. 2021లో అత్యధికంగా వీకిపీడియాలో వెతికిన పర్సనాలిటీగా పునీత్ నిలిచాడు. ఈ ఏడాది ప్రేక్షకులు అత్యధికంగా వెతికిన స్టార్ పునీత్ మాత్రమే. ఆయన చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు పునీత్ రాజ్‌కుమార్ గురించి తెలుసుకోడానికి వికీ వైపు పరుగులు తీశారు. అందుకే 2021లో ఈ అరుదైన ఘనత సాధించాడు ఈయన. ఈ విషయం తెలిసి పునీత్ అభిమానులు ఓ వైపు గర్వంగా.. మరోవైపు ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
sirivennela | 2021లో హఠాన్మరణం చెందిన సినీ ప్రముఖులు వీళ్లే..
పునీత్ రాజ్‌కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గంధద గుడి’ టీజర్.. ఫ్యాన్స్ ఎమోషనల్..
Puneeth Rajkumar | పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథే
సిరివెన్నెల నెలకు ఎన్ని పాటలు రాసేవారో తెలుసా.. రెమ్యునరేషన్ ఎంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

