కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) ఫ్యామిలీకి నందమూరి కుటుంబానికి మంచి సాహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వరకు ఈ రెండు కుటుంబాల మధ్య అనుబంధం కొనసాగుతూ వస్తోంది. పునీత్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం పట్ల హృదయం బద్దలైందని, ఇంత త్వరగా అందరినీ విడిచి వెళ్లిపోతావని ఊహించలేదని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
కన్నడ హీరో (Sandalwood) అయిన పునీత్ రాజ్‌కుమార్ టాలీవుడ్ (Tollywood) హీరోలతో కూడా మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తుంటాడు. జూ.ఎన్టీఆర్‌ను అయితే తన సోదరుడిలా భావించేవాడు పునీత్. ఈ విషయాన్ని ఓ సారి హైదరాబాద్‌కు వచ్చినపుడు పునీత్ రాజ్‌కుమార్ స్వయంగా చెప్పాడు. తారక్ తమ కుటుంబ సభ్యుడని, అతన్ని నా సోదరుడిగా భావిస్తానని అన్నాడు. పునీత్ రాజ్‌కుమార్, ఎన్టీఆర్‌ల మధ్య కామన్ థింగ్స్ ఏంటంటే..ఇద్దరూ మంచి నటులే కాదు, మంచి డ్యాన్సర్లు, టీవీ హోస్టులు కూడా. పాటలు కూడా పాడతారు. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమాకు ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడాడు.
యువరత్న సినిమా ప్రమోషన్స్ సమయంలో హైదరాబాద్‌కు వచ్చినపుడు తెలుగు ప్రేక్షకులు, టాలీవుడ్ హీరోల గురించి పునీత్ రాజ్‌కుమార్ పంచుకున్న విశేషాలకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ పాత వీడియో ఇపుడు ట్రెండింగ్ అవుతోంది.
గెలెయా గెలెయా అంటూ స్టూడియోలో పునీత్ సమక్షంలో ఎన్టీఆర్ పాడిన పాటపై ఓ లుక్కేయండి..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి