పబ్లిసిటీ డిజైనర్ వివరెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ప్రతాప్ భీమవరపు దర్శకుడు. లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నది. దర్శకుడు మాట్లాడుతూ ‘పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తులపై వున్న ప్రేమ తమ పేరెంట్స్‌పై లేకపోవడం వల్ల వాళ్లు ఎలాంటి మానసిక క్షోభకు గురవుతున్నారో ఇతివృత్తంగా తయారుచేసుకున్న కథ ఇది.
ఈ చిత్రంలో కొడుకుగా వివరెడ్డి చేస్తున్న ప్రధాన పాత్ర సమాజంలో చాలా మందికి కనువిప్పు కలిగించే విధంగా ఉంటుంది’ అన్నారు. అనురాధ, రారాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బాపు శాస్త్రి.