కొత్త పాయింట్‌తో సినిమా తీశాం!
సినిమాల విషయంలో చిన్నా పెద్ద అనే విషయం కంటే సక్సెస్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి. ప్రేక్షకుల మెప్పుపొందే సినిమా ఏదైనా నా దృష్టిలో పెద్ద సినిమానే’ అని అన్నారు యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
‘సినిమాల విషయంలో చిన్నా పెద్ద అనే విషయం కంటే సక్సెస్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి. ప్రేక్షకుల మెప్పుపొందే సినిమా ఏదైనా నా దృష్టిలో పెద్ద సినిమానే’ అని అన్నారు యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ ఏడాది ‘డీజే టిల్లు’ ‘భీమ్లా నాయక్’ చిత్రాలతో భారీ విజయా ల్ని అందుకున్నారాయన. సితార ఎంటర్టైన్మె ంట్స్ పతాకంపై బెల్లంకొండ గణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ నాగవంశీ నిర్మించిన తాజా చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడు. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు…
‘స్వాతిముత్యం’ కథలో మీకు బాగా నచ్చిన అంశాలేమిటి?
పండగ సమయంలో ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకొని ఆనందించే చిత్రమిది. ఆద్యంతం వినోద ప్రధానంగా కుటుంబ అనుబంధాల నేపథ్యంలో కథ నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ సినిమా తీశాం. అదేమిటో తెరపై చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
సినిమాకు ఓ క్లాసిక్ ఫిల్మ్ టైటిల్ పెట్టడానికి కారణమేమిటి?
ఈ సినిమాలో హీరో అమాయకుడు, చాలా మంచోడు. శేఖర్ కమ్ముల సినిమాల్లోని హీరోలా ఉంటాడు. అతని స్వభావాన్ని తెలియజేసేలా టైటిల్ పెట్టాం. ఓ క్లాసిక్ టైటిల్ అయితే ప్రేక్షకులకు త్వరగా చేరువవుతుందని భావించాం.
మీ బ్యానర్లో పెద్ద సినిమాలతో పాటు కొత్త కథలతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. ఇక ముందు ఇదే పంథాను కొనసాగిస్తారా?
చిన్నా పెద్ద అనే విషయాల్ని పక్కన పెడితే…కథలో కొత్తదనం, ఏదైనా యూనిక్ పాయింట్ ఉందనిపిస్తే వెంటనే సినిమా ఓకే చేస్తున్నాం. అదే వరుసలో డీజే టిల్లు, వరుడు కావలెను, స్వాతిముత్యం వంటి సినిమాల్ని చేశాం. అలాగే మా సంస్థ లైనప్‌లో బాలకృష్ణ, రవితేజ, వైష్ణవ్‌తేజ్, నవీన్ పొలిశెట్టిలతో పక్కా కమర్షియల్ చిత్రాలున్నాయి. తారక్ బావమరిదిని హీరోగా పరిచయం చేస్తూ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాం.
చిరంజీవిగారు మీ సినిమాను ప్రత్యేకంగా అభినందించడం ఎలా అనిపించింది?
మంచి సినిమాల్ని అభినందించడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన చిరంజీవి అయ్యారు. ఇండస్ట్రీకి పెద్దగా మారారు. ఆయన ఆశీస్సులు మాకు క్రొత్త ఉత్సాహాన్నిచ్చాయి.
మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా గురించి చెబుతారా?
వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలకు థియేటర్స్‌లో కావాల్సినంత ఆదరణ దక్కలేదు. కానీ టీవీల్లో చాలా మంది వీక్షించారు. తాజా చిత్రం ప్రేక్షకుల అంచనాల్ని మించి ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

