రాజు.. జాకీ.. రాణి
1990ల కాలంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామా ‘కేజేక్యూ’. ‘King Jackie Queen’ అనేది ఉపశీర్షిక. దసరా, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలతో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్‌శెట్టి హీరోగా, శశి ఓదెల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి స్వర్గీయ కె.కె దర్శకుడు.
1990ల కాలంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామా ‘కేజేక్యూ’. ‘King Jackie Queen’ అనేది ఉపశీర్షిక. దసరా, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలతో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్‌శెట్టి హీరోగా, శశి ఓదెల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి స్వర్గీయ కె.కె దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ చిత్ర దర్శకుడు కేకే గత ఏడాది కన్ను మూశారు.
ఆయనకు సినిమాపై ఉన్న పాషన్, విజన్‌కి నివాళిగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ప్రచార చిత్రాల వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయని, సినిమా తప్పకుండా ప్రేక్షకులకు ఓకొత్త అనుభూతినిస్తుందని మేకర్స్ నమ్మకం వెలిబుచ్చారు. యుక్తి తరేజా కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బానెస్, సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

