RRR Budget | అంత భారీ బడ్జెట్‌తో RRR సినిమాను తెరకెక్కించారా?
ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో 'ట్రిపుల్ ఆర్' ఒకటి. 'బాహుబలి' తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
RRR Budget | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘ట్రిపుల్ ఆర్’ ఒకటి. ‘బాహుబలి’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ‘ట్రిపుల్ఆర్’ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయునున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. ప్రమోషన్లో భాగంగా రాజమౌళి ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
రాజమౌళి మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి ప్రొడక్షన్ కాస్ట్ సుమారు 550 కోట్ల వరకు అయింది, సరిగ్గా ఆ నెంబర్ నాకు కూడా తెలియదు. అయితే, ఇప్పటికే ఈ చిత్ర బిజినెస్ ద్వారా చాలా వరకు బడ్జెట్ రికవరీ అయిందని’ తెలిపాడు. డివివి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై దానయ్య డివివి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఎత్తర జెండా’ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో నటించనుండగా.. ఎన్టీఆర్ ‘కొమరం భీం’ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కీరవాణి స్వరాలను సమకూర్చాడు. ఇప్పటికే ‘దోస్తీ’, ‘నాటు నాటు’ పాటలు యూట్యూబ్‌లో మిలియన్లలో వ్యూస్‌ను సాధించాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. ఆలియాభట్, ఒలీవియా మెర్రీస్ కథానాయికలుగా నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

