Purushaha | బత్తుల కోటేశ్వర రావు కుమారుడు పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా పురుష (Purushaha). వీరు వులవల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ మే 22న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత బత్తుల కోటేశ్వర్ రావు సినిమా విశేషాలు షేర్ చేసుకున్నాడు.
మాది గుంటూరు జిల్లాలోని కారంపూడి. నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా చాలా సపోర్ట్ చేస్తున్నారు. గోకులంలో సీత సినిమా చూసిన తర్వాత పవన్ కల్యాణ్‌కు అభిమానిగా మారిపోయా. నాకు కొడుకు పుడితే ఆయన పేరు పెట్టుకోవాలని అనుకున్నా. తమ్ముడు సినిమా టైంలో మాకు అబ్బాయి పుట్టడంతో ఆయన పేరు పెట్టానన్నారు. నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. మా అబ్బాయికి సిగ్గు, బిడియం ఎక్కువ. హీరో అవ్వాలన్న నా కలను మా కొడుకు ద్వారా నెరవేర్చుకున్నా. అందుకే అతడిని హీరోగా చేశాను. పురుష : కథ చాలా బాగుంది బత్తుల కోటేశ్వర్ రావు.
డైరెక్టర్ వీరు వులవల నెరేషన్ డిఫరెంట్‌గా ఉండటంతోపాటు ఇందులో ఉన్న ప్రేమకథ నాకు బాగా నచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమా ఉంటుంది. డబ్బుల కోసమైతే సినిమా తీయలేదు. లాభాలు ఆశించడం లేదు. మా అబ్బాయికి నేను ముందుగానే మాటిచ్చా. మూడు సినిమా చేస్తానని చెప్పా. అప్పటివరకు మా వాడు నిరూపించుకుని హీరోగా నిలబడితే ఒకే.. లేదంటే మళ్లీ మా ఊరికొచ్చి వ్యవసాయం చేయాలని ముందే చెప్పానన్నారు. సినిమాలో వీటీవీ గణేశ్ పాత్ర అందరినీ నవ్విస్తుంది. వెన్నెల కిశోర్ వల్ల కథలో సంఘర్షణ వస్తుంది. సప్తగిరి,కసిరెడ్డి రాజ్‌కుమార్ బాగా నటించారు. అనంత శ్రీరామ్ రోల్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. మా అబ్బాయి గురించి నేను చెప్పను సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెప్పాల బత్తుల కోటేశ్వర్ రావు చెప్పుకొచ్చారు.
ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Chattogram | బంగ్లాదేశ్‌లో భారతీయ దౌత్యవేత్త అనుమానాస్పద మృతి.. గుండె పోటే కారణమా..?
US Tragedy | అమెరికాలో బాపట్ల టెక్కీ మృతి.. తల్లిదండ్రులు, తమ్ముడికి తీవ్ర గాయాలు