యువతకు నచ్చే చిత్రమిది
పలు సూపర్‌హిట్ చిత్రాలను టాలీవుడ్‌కు అందించిన నిర్మాత ఎంఎస్ రాజు. ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’..ఇలా వరుస విజయాలతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారాయన. దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. ఆయన తాజాగా రూపొందించిన సినిమా ‘ 7డేస్ 6నైట్స్’. సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోషన్, కృతికా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు ఎంఎంస్ రాజు.
రాజ్ కపూర్ ‘బర్సాత్’ సినిమా ప్రభావంతో ఈ కథను సిద్ధం చేసుకున్నా.
ఆ సినిమాలోని రెండు పాత్రల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించాను. రాజ్ కపూర్ పాత్రలా సుమంత్ అశ్విన్ క్యారెక్టర్ డిజైన్ చేశాను. జీవితంలో అతనికొక లక్ష్యం ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి అతన్ని వదిలేసి అమెరికా వెళ్లిపోతుంది. దాంతో కేర్లెస్గా ఉంటాడు.
యువ ప్రేక్షకులనే టార్గెట్ చేసుకుని సినిమా రూపొందించారా?
ప్రస్తుతం థియేటర్లకు వస్తున్నది యువతరం మాత్రమే. అందుకే యూత్‌ఫుల్ సినిమా అని చెబుతున్నాం. కానీ అడల్ట్ కంటెంట్ మూవీ కాదు. దీంట్లో కుటుంబ ప్రేక్షకులకూ నచ్చే అంశాలు ఉన్నాయి. మేము హద్దులు దాటి సినిమా చేసి ఉంటే సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్లు. కానీ మా చిత్రానికి యూఏ వచ్చింది.
నాకు నిర్మాతగా విజయాలు వచ్చాయి గానీ దర్శకుడిగా దక్కలేదు. ఆ తపనతో ఈ సినిమా కోసం బలమైన కథను రాశాను. యూత్‌ఫుల్ సినిమా కాబట్టి యువతరం నాడి పట్టుకోవాలి. వాళ్ల భావోద్వేగాలు ఎలా ఉంటాయి?, ఎలా ప్రవర్తిస్తారు?, వ్యవహారశైలి ఎలా ఉంటుంది..ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అనుకున్నా. ఇంట్లో చెప్పకుండా ఒక్కడినే గోవా వెళ్లా. ఐదారు రోజులు తిరుగుతూ యువత ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకున్నా.
మీ అబ్బాయి సుమంత్ అశ్విన్‌ను హీరోగా పెట్టడానికి కారణం
మా అబ్బాయికి హిట్ ఇవ్వడానికే ఈ సినిమా చేశానని చాలా మంది అనుకుంటున్నారు. అలా అయితే డర్టీ హరి చిత్రాన్ని అతనితోనే రూపొందించేవాడిని. తను ఏ పాత్రకు సరిపోతాడో, ఏ కథకు న్యాయం చేయగలడో ఆ చిత్రంలోనే తీసుకున్నాను. ఇందులో రోషన్ బాగా నవ్విస్తాడు. ఎమోషనల్‌గా ఉండే మరో పాత్ర ఉంది. దానికి సుమంత్ అశ్విన్ సరిపోతాడనిపించింది.
సినిమాల ఎంపికలో మీ దృక్పథం మారిందని అనుకోవచ్చా?
నాకు రిటైర్మెంట్ వయసు వచ్చిందంటున్నారు కానీ సినిమాల రూపకల్పనలో ఇంకా తపన పెరుగుతోంది. సినిమా తెరపై ప్రారంభమయ్యాక ఒక వేగంతో వెళ్లిపోవాలి, ప్రేక్షకులకు ఫోన్లు చూసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. అలాంటి కొత్త తరహా చిత్రాలు తెరకెక్కించాలని అనుకుంటున్నాను. కథలో ఒక చిన్న ట్విస్ట్ సినిమా ఫలితాన్నే మార్చేసేలా సినిమా ఉండాలన్నది నా కోరిక.
ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు
సతి అనే పేరుతో సినిమా చేస్తున్నాను. భార్యా భర్తల మధ్య జరిగే కథ ఇది. చిత్రీకరణ పూర్తయింది. మిస్టరీ జానర్లో సినిమా సాగుతుంది. నా గత చిత్రాల్లో ఒక సినిమాకు సీక్వెల్ చేస్తున్నాను. 14 భాషల్లో ఆ సినిమా రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నాం. అక్టోబర్‌లో ఈ చిత్ర పనులు మొదలవుతాయి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రతికా వందనం.. మెరిసిన శ్రీచరణి
బౌలర్లపైనే బెంగ.. నేడు న్యూజిలాండ్‌తో భారత్ రెండో టీ20
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

