Priyanka singh elimination from bigg boss 5 telugu | బిగ్ బాస్ 5 తెలుగు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకు అందులో ఉన్న జోడీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరెవరు బాగా కనెక్ట్ అయ్యారు అనే ప్రశ్న వేస్తే వెంటనే వచ్చే సమాధానం మానస్, ప్రియాంక సింగ్. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ మాదిరి సీజన్ మొదలైనప్పటి నుంచి మానస్ మనసు గెలుచుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది పింకీ. అయితే ఈ ప్రయత్నంలో చాలా సార్లు ఓడిపోయింది. తనకు ఇలాంటివన్నీ నచ్చవని.. ఒక స్నేహితుడి మాదిరిగా మీ జీవితం మొత్తం ఉంటాను అంటూ ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పాడు మానస్. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు పింకీ. ఇదిలా ఉంటే 13 వారాల తర్వాత ఈమె ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. అనధికారికంగా ఇప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
డిసెంబర్ 5 ఆదివారం ఎపిసోడ్ తర్వాత పింకీ అఫిషియల్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ అవుతుంది. అయితే ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజి మీదికి వచ్చి నాగార్జున దగ్గర కాసేపు ఇంటి సభ్యులతో మాట్లాడతారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలోనే తమ మనసులో మాట చెబుతారు. ఇంట్లో ఉండి వాళ్ళతో షేర్ చేసుకోలేకపోయిన కొన్ని విషయాలు కూడా స్టేజి మీదికి వచ్చి ఓపెన్ అవుతుంటారు కొందరు కంటెస్టెంట్స్. ఈ క్రమంలోనే పింకీ కాస్త ధైర్యం చేసినట్లు తెలుస్తోంది. మానస్ పై తనకున్న ప్రేమను ఇన్ని రోజులు కేవలం మనసులో దాచుకున్న ఈమె ఇప్పుడు అందరి ముందు ఓపెన్ అయిపోయిందని తెలుస్తోంది.
నిజానికి ఈ మధ్య ఇంట్లో తన అన్నయ్యగా భావించే సన్నీతో ఈ విషయం చెప్పింది పింకీ. మానస్ తో చిన్న గొడవ అయినప్పుడు అతడు ఏమైనా అంటే తాను తట్టుకోలేను అని.. i love him అంటూ అసలు విషయం చెప్పింది పింకీ. ఇప్పుడు అందరి ముందు ఇదే విషయం చెప్పనుందని తెలుస్తోంది. తాను ఒక ట్రాంజెండర్ కాబట్టి.. ఇలాంటి రిలేషన్స్ కు దూరంగా ఉండాలి అని ఇంట్లో కొన్ని సార్లు తోటి కంటెస్టెంట్స్ తో పింకీ చెప్పింది. కానీ మనసులో ప్రేమ మాత్రం బయటకు దాచుకోలేకపోయింది. ఈ విషయం అయిన తర్వాత మానస్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Priyanka singh elimination | ఎట్టకేలకు పింకీ ఎలిమినేట్ అయ్యిందిగా..
Sanya Malhotra: నాలుగేళ్ల రిలేషన్ బ్రేకప్ కావడంతో డిప్రెషన్లోకి వెళ్లానంటున్న దంగల్ బ్యూటీ
Bigg Boss: టికెట్ టూ ఫినాలే విజేతగా శ్రీరామ్.. ప్రియాంకకి వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్
Sunny: సన్నీ ముఖంపైకి టిష్యూ విసిరేసిన కాజల్.. !
Siri: తొండి గేమ్ ఆడిన సిరి.. కాజల్‌పై మండిపడ్డ సన్నీ