ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో మన దేశం నుంచి ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా ఎంపికైంది ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో మన దేశం నుంచి ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా ఎంపికైంది ‘ఛల్లే షో’ సినిమా. ‘ ‘ఆస్కార్ 2023’ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ సినిమాకు తన వంతు ప్రోత్సాహాన్ని అందించింది స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. లాస్ ఏంజెలీస్‌లో ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ షోకు దర్శకుడు పాల్ నలిన్, బాల నటుడు భవీన్ రబరి హాజరయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు పాన్ నలిన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రియాంక ఆతిథ్యానికి చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపారు. వేసవి సెలవుల్లో తన ఊరి థియేటర్లో సినిమాలు చూసిన తొమ్మిదేండ్ల బాలుడు సమయ్, ఆ చిత్రాలు చూసి ఎలా ప్రభావితం అయ్యాడు అనేది చిత్ర కథాంశం. ఇక ప్రియాంక కెరీర్ విషయానికొస్తే గత కొద్దికాలంగా హాలీవుడ్‌కే పరిమితమైందీ తార. ప్రస్తుతం హిందీలో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు, ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘జీలే జరా’ చిత్రంలో నటిస్తున్నది.