టాక్సీవాలా సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రియాంకా జవాల్కర్ (Priyanka Jawalkar). ఈ అనంతపురం బ్యూటీ ఇన్ స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు, అభిమానులతో చిట్ చాట్ సెషన్లో పాల్గొన్నది. ఈ సందర్భంగా మీ కోలీవుడ్ క్రష్ (Kollywood crush) ఎవరు అని ఓ అభిమాని అడిగారు.
దీనికి ప్రియాంకా స్పందిస్తూ..నా క్రష్ ఎప్పుడూ ధనుష్ (Dhanush). అయితే కొన్ని కారణాల వల్ల శింబు (Simbu)ను కూడా ఇష్టపడటం మొదలుపెట్టా. ఇద్దరు క్యూట్‌గా అనిపిస్తారు.. అంటూ చెప్పుకొచ్చింది. త్వరలో తమిళ చిత్రపరిశ్రమలోకి కూడా రావాలని ప్రియాంకను కోరారు నెటిజన్లు, ఫాలోవర్లు. ధనుష్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సార్/వాథి సినిమాతో బిజీగా ఉన్నాడు.
మరోవైపు శింబు పలు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. చివరగా గమనం సినిమాలో వన్ ఆఫ్ ది కీ రోల్లో కనిపించిన ప్రియాంకా ఇప్పటివరకు కొత్త సినిమా ప్రకటించలేదు.