Priyanka Chopra: ఆ సీన్ చేయమన్నారు.. కానీ ఆ సినిమానే వదలేశా: ప్రియాంకా చోప్రా
Priyanka Chopra: తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని నటి ప్రియాంకా చోప్రా గుర్తు చేసుకున్నది. కెరీర్ ఆరంభంలో ఓ డైరెక్టర్ తనతో ఓ అసభ్యకర సీన్ చిత్రీకరించాలని అనుకున్నట్లు ఆమె చెప్పింది. కానీ అది నచ్చక ఆ సినిమాను వదిలేసుకున్నట్లు ఆమె వెల్లడించింది.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా(Priyanka Chopra)కు తన కెరీర్ ఆరంభంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. డైరెక్టర్ ప్రవర్తన నచ్చక ఆమె ఓ సినిమాను వదిలేసుకున్నది. ద జో రిపోర్ట్‌తో ఇటీవల మాట్లాడిన ప్రియాంకా ఈ విషయాన్ని వెల్లడించింది. ఓ సీన్ కోసం ఆ ఫిల్మ్ డైరెక్టర్ తనను అండర్వేర్లో చూడాలనుకున్నాడని, కానీ అది తనకు నచ్చలేదని, అందుకే ఆ హిందీ సినిమాను వదిలేసినట్లు ప్రియాంక చెప్పింది. ఆ ఘటన చాలా అవమానకరమైందని ఆమె అన్నారు. ఆ ఫిల్మ్ నిర్మాతలకు తనపై ఖర్చు చేసిన డబ్బుల్ని వాపస్ ఇచ్చినట్లు ఆమె చెప్పింది. అయితే ఆ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరన్న విషయాన్ని ఆమె చెప్పలేదు. కానీ 2002 లేదా 2003లో ఈ ఘటన జరిగినట్లు ఆమె గుర్తు చేసింది.
హీరోను పల్టీ కొట్టించేందుకు ఓ సీన్లో దుస్తులు విప్పాల్సి వస్తుంది. అయితే ఆ సమయంలో హీరోయిన్ అండర్వేర్లో ఉండాలని, లేదంటే సినిమాను ఎవరు చూస్తారని ఫిల్మ్‌మేకర్ అన్నాడని ప్రియాంక తెలిపింది. కానీ ఆ డైరెక్టర్ తనతో నేరుగా ఆ మాటలు అనలేదని, తన స్టయిలిస్టుతో ఆ వ్యాఖ్యలు చేసినట్లు ప్రియాంకా వెల్లడించింది. ఆ క్షణంలో డైరెక్టర్ శైలి నచ్చలేదని, దీంతో ఆ సినిమాను వదిలేసినట్లు ఆమె చెప్పింది. తన తండ్రి ఇచ్చిన సలహా మేరుకు ఆ సినిమాను రెండు రోజుల్లోనే వదులుకున్నట్లు ఆమె పేర్కొన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

