Prithviraj Sukumaran | The Goat Life తెలుగు ప్రమోషన్స్‌పై నెటిజన్‌కు పృథ్విరాజ్ సుకుమారన్ రిప్లై ఇదే
Prithviraj Sukumaran | మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటిస్తున్న తాజా చిత్రం The Goat Life. బెన్యమిన్ రాసిన Aadujeevitham నవల స్ఫూర్తితో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవలే లాంఛ్ చేయగా.. ఎప్పటిలాగే పృథ్విరాజ్ సుకుమారన్ తన పాత్రకు ప్రాణం పోశాడని అర్థమైపోతుంది.
Prithviraj Sukumaran| ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). ఈ స్టార్ హీరో నటిస్తున్న తాజా చిత్రం The Goat Life. వాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యమిన్ రాసిన Aadujeevitham నవల స్ఫూర్తితో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవలే లాంఛ్ చేయగా.. ఎప్పటిలాగే పృథ్విరాజ్ సుకుమారన్ తన పాత్రకు ప్రాణం పోశాడని అర్థమైపోతుంది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పృథ్వి ఆడుజీవితం సినిమాను కన్నడతోపాటు తెలుగులో కూడా ప్రమోట్ చేస్తావని ఆశిస్తున్నా. రాబోయే రోజుల్లో తెలుగులో కూడా కొంత ప్రమోషన్ చేయాలి. అందరికీ ఈ సినిమాను అందించాలి. దయచేసి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయు అంటూ ఓ నెటిజన్ కోరాడు. దీనికి పృథ్విరాజ్ సుకుమారన్ స్పందిస్తూ.. అవును తెలుగు, కన్నడ ప్రేక్షకులు అంటే మాకు చాలా ముఖ్యం. మార్చి 22 నుంచి 24 వరకు మేం హైదరాబాద్, బెంగళూరులో ప్రమోట్ చేస్తాం. తెలుగు, కన్నడ సెన్సార్ కోసం ఎదురుచూస్తున్నాం. సెన్సార్ పూర్తయ్యాక మేము ప్రపంచవ్యాప్తంగా ప్రధాన భాషల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని రీట్వీట్ చేశాడు. ఇప్పుడీ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు మూవీ లవర్స్.
పృథ్విరాజ్‌కు నా అభినందనలు, ఆల్ ది బెస్ట్. అమితమైన ప్రేమతో ది గోట్ లైఫ్ కోసం ఎదురు చూస్తున్నా.. బ్లాక్‌బస్టర్ లోడ్ అవుతోంది.. అంటూ ఇన్‌స్టా స్టోరీలో ప్రభాస్ పెట్టిన పోస్ట్‌తో The Goat Life సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. బ్లేస్సీ రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో జిమ్మీ జీన్- లూయిస్, అమలాపాల్, రిక్ అబీ, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, అట్ల గ్లోబల్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.
Of course we will! The Telugu and Kannada audience matter a lot to us! 22nd – 24th we will be in Hyderabad and Bangalore! Waiting for the Telugu and Kannada censor to be done so that we can open bookings for all languages together all over the world. Thank you for the love! 🙂❤️ https://t.co/ZIH7fLEbfY
— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 21, 2024
Thank you Deva see you in the battlefield soon! 💥
-Prithviraj sir via Instagram #Prabhas #Kalki2898AD #Salaar #SHOURANGYAPARVAM #Kalki2898ADonMay9 pic.twitter.com/RoPU27vebv
— Prasanth🦖 (@Prastweetzz01) March 10, 2024
The Goat Life ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

