Varun Tej | వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ఎక్కడి వరకు వచ్చింది ?
Varun Tej | ప్రవీణ్ చెప్పిన కథ నచ్చి గాండీవధారి అర్జున సినిమాకు కమిట్ అయ్యాడు వరుణ్ తేజ్. ఆ మధ్య లండన్ వెళ్లి ఒక భారీ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుని వచ్చారు దర్శక నిర్మాతలు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత.
Varun Tej | హీరో మార్కెట్ తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ పెడితే తర్వాత మునిగిపోయేది నిర్మాత. ఒకవేళ ఎక్కువ బడ్జెట్ పెడితే రేపు విడుదలైన తర్వాత ఆ సినిమా హిట్ అయినా కూడా కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు. గతంలో మహేష్ బాబు అతడు సినిమా విషయంలో ఇదే జరిగింది. చెప్పుకోవడానికి అది కల్ట్ క్లాసిక్ సినిమా అయినా కూడా థియేటర్లలో నిర్మాత మురళీ మోహన్ కు నష్టాలు తీసుకొచ్చింది . దానికి కారణం అప్పటి మహేష్ బాబు మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టడం.
ఆ తర్వాత కూడా చాలా సినిమాలకు ఇలాంటి ఫలితాలు వచ్చాయి. తాజాగా వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో వస్తున్న గాండీవధారి అర్జున సినిమాకు కూడా బడ్జెట్ సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన అతి తక్కువ మంది దర్శకులలో ప్రవీణ్ కూడా ఒకడు. ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయిన రాజశేఖర్ ను హీరోగా పెట్టి గరుడవేగా లాంటి అద్భుతమైన టెక్నికల్ సినిమా చేశాడు ఈయన.
అది నమ్మి ఆయనకు ఘోస్ట్ సినిమా ఇచ్చాడు నాగార్జున. కాకపోతే ఆ చిత్రం అంచనాలు అందుకోలేదు. అది ఫ్లాప్ అయినా కూడా ప్రవీణ్ చెప్పిన కథ నచ్చి గాండీవధారి అర్జున సినిమాకు కమిట్ అయ్యాడు వరుణ్ తేజ్. ఆ మధ్య లండన్ వెళ్లి ఒక భారీ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుని వచ్చారు దర్శక నిర్మాతలు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత.
Read More: Teja Sajja | ఒక్క రోజు యాడ్ షూట్‌కే తేజ సజ్జా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
అంతా బాగానే ఉన్నా హైదరాబాదులో మొదలు కావాల్సిన ఈ సినిమా రెండో షెడ్యూల్ ఇంకా మొదలు కాలేదు. దానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు, నిర్మాత బోగవల్లి ప్రసాద్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కారణం అని తెలుస్తోంది. రెండో షెడ్యూల్ కే ముందు ఫిక్స్ చేసుకున్న బడ్జెట్ కంటే రెండింతలు ఎక్కువైందని.. అంత బడ్జెట్ వరుణ్ తేజ్ పై వర్కౌట్ కాదని నిర్మాత వాదిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ బడ్జెట్ లెక్కలు తేలే వరకు రెండో షెడ్యూల్ మొదలు పెట్టకూడదని నిర్మాత ఫిక్స్ అయ్యాడు.
Read More: Harish Shankar | హరీష్ శంకర్‌కు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడా.. ? ఇస్తే సినిమా పూర్తి చేయగలడా.. ?
అయితే ఈ విషయంలో దర్శకుడు ప్రవీణ్ సత్తార్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. తన కథకు అవసరమైన బడ్జెట్ పెట్టకపోతే అవుట్ పుట్ దెబ్బతింటుందని ఆయన భావిస్తున్నాడు. మరోవైపు వరుణ్ తేజ్ మాత్రం ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. ఒకవేళ ఇక్కడ షెడ్యూల్ అనుకున్న టైం కు మొదలు కాకపోతే తన తర్వాత సినిమాను షురూ చేయాలని ఆలోచిస్తున్నాడు మెగా వారసుడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

