Harish Shankar | హరీష్ శంకర్‌కు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడా.. ? ఇస్తే సినిమా పూర్తి చేయగలడా.. ?
తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)లో కొందరు దర్శకులు కెరీర్ మొత్తం స్టార్ హీరోలతోనే పని చేసి ఉంటారు. అందులో అందరికంటే ముందు చెప్పుకోవాల్సిన దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar). పవన్ కళ్యాణ్ (Pawankalyan)తో హరీష్ శంకర్ సినిమా కమిట్ అయ్యాడు అనే ముచ్చటే కానీ ఇంతవరకు అది మొదలైంది లేదు.
తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)లో కొందరు దర్శకులు ఉంటారు.. వాళ్ల జాతకం ఏదో ఓ పట్టాన ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ల కెరీర్ మొత్తం స్టార్ హీరోలతోనే పని చేసి ఉంటారు. దాదాపు 80% విజయాలు ఉంటాయి. అయినా కూడా వాళ్లు నెక్స్ట్ సినిమా చేయడానికి రెండు మూడేళ్ల సమయం తీసుకుంటూ ఉంటారు. అందులో అందరికంటే ముందు చెప్పుకోవాల్సిన దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar). ఈయన గత సినిమా గద్దలకొండ గణేష్ 2019 మధ్యలో వచ్చింది. ఇప్పటివరకు మరో సినిమా విడుదల చేయలేకపోయాడు ఈ దర్శకుడు.
పవన్ కళ్యాణ్ (Pawankalyan)తో సినిమా కమిట్ అయ్యాడు అనే ముచ్చటే కానీ ఇంతవరకు అది మొదలైంది లేదు. ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. ఎందుకంటే పవన్ ఒకవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తున్నాడు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. హరీష్ శంకర్ కంటే తర్వాత వచ్చిన దర్శకుల సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్న పవన్.. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమాను మాత్రం అలాగే ఉంచేసాడు. దానికి కారణం కూడా తెలియడం లేదు. దాదాపు మూడేళ్ల ఎదురు చూపుల తర్వాత ఈయనకు డేట్స్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్.
మార్చ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు డేట్స్ కేటాయించాడు పవర్ స్టార్. అయితే ఇక్కడ కూడా ఒక మెలిక పెట్టాడు. కేవలం 34 రోజులు మాత్రమే ఈ సినిమాకు డైట్స్ ఇచ్చాడు. ఆ కొన్ని రోజుల్లోనే సినిమాను పూర్తి చేయాలి.. లేదంటే మళ్లీ ఇతర సినిమాలతో బిజీ కానున్నాడు పవన్. ఒకవేళ అదే జరిగితే మళ్లీ ఆయన డేట్స్ ఎప్పటికి ఇస్తాడో ఎవరికీ క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఆయన షెడ్యూల్ ఇప్పుడు అంత బిజీగా ఉంది కాబట్టి. మూడు సంవత్సరాల ఎదురు చూపులకు కేవలం 30 రోజులు మాత్రమే కేటాయించాడు పవన్. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైపోయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా అన్ని పక్కాగా చేసుకున్నాడు హరీష్ శంకర్.
తమిళంలో ఆరేళ్ల కింద వచ్చి సూపర్ హిట్ అయిన తేరీ సినిమాకు ఇది రీమేక్. దీనిపై అధికారికంగా దర్శకుడు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.. కానీ అదే సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న మరో దర్శకుడు దశరథ్ క్లారిటీ ఇచ్చాడు. మరోసారి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. మార్చి మొదటి వారంలో షూటింగ్ మొదలుపెట్టి.. ఏప్రిల్ మొదటి వారంలో గుమ్మడికాయ కొట్టాలని చూస్తున్నాడు పవర్ స్టార్. మరి అంత వేగంగా హరీష్ శంకర్ సినిమా పూర్తి చేస్తాడా లేదా చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

