బీఆర్ఎస్కే మా మద్దతు
గత పదేళ్లుగా సినీ రంగానికి సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు.
గత పదేళ్లుగా సినీ రంగానికి సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘చిత్ర పరిశ్రమకు ఏ అవసరం ఉన్నా ప్రభుత్వం తరపున మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
సినీ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, దివ్యాంగులకు పింఛన్లు అందేలా సహాయం చేశారు. గత పదేళ్లుగా హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణ మరింతగా అభివృద్ధి సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సత్యప్రకాష్, నిర్మాత గురురాజ్, దర్శకుడు బందూక్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

