MAA Election | సీసీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాష్‌రాజ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న ప్రకాష్‌రాజ్‌తో పాటు అతడి ప్యానల్‌కు సంబంధించిన పలువురు సభ్యులు సోమవారం పోలింగ్ నిర్వహించిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వద్దకు వచ్చారు. ఎన్నికల రోజున సీసీ టీవీ ఫుటేజీలను తమకు చూపించాలంటూ కోరారు. దాంతో జూబ్లీహిల్స్ పోలీసుల సమక్షంలో సుమారు గంటన్నర పాటు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఎన్నికల రోజున జరిగిన వాగ్వాదాలతో పాటు కౌంటింగ్ సమయంలో జరిగిన ఘటనలపై తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వచ్చామని ప్రకాష్‌రాజ్ తెలిపారు. పోలింగ్ మరుసటిరోజునే ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ను సీసీ ఫుటేజీ ఇవ్వాలని కోరామని, అయితే ఆయన నిరాకరించడంతో పోలీసుల సమక్షంలో ఫుటేజీని పరిశీలించామని ప్రకాష్ రాజ్ తెలిపారు. డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డిల సమక్షంలో ఫుటేజీని పరిశీలించిన ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్ తదితరులు వెళ్లిపోయారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- MAA Election
- Prakash raj
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

