మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందడడంతో ప్రకాశ్‌రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రీసెంట్గా ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామా నిర్ణయం బాధతో తీసుకున్నది కాదని తెలిపారు. తెలుగువాడిగా పుట్టకపోవడం తన దురదృష్టమన్నారు. అతిథిగా వచ్చానని, అతిథిగానే ఉంటానని ప్రకటించారు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయని అన్నారు.
అయితే ప్రకాశ్ రాజ్ నిర్ణయాన్ని తాను స్వాగతించడం లేదని, మీతో కలిసి ముందుకు సాగాలని తాను కోరుకుంటున్నట్టు విష్ణు పేర్కొన్నారు. కాగా ప్రకాశ్ రాజ్ రీసెంట్గా తన ట్విట్టర్లో.. మా సభ్యత్వానికి తాను రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉందని, అదేంటో త్వరలోనే తెలియజేస్తానని తెలిపారు. మాకు మద్దతుగా నిలిచిన ‘మా’ సభ్యులకు నమస్కారం. నేను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉంది. మిమ్మల్ని మేం నిరాశ పరచం. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా’ అని పేర్కొన్నారు.